పుట:Haindava-Swarajyamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

217

ద్వితీయ భాగము.

బుడమిఁ బుట్టిన పెనుభూతంబు గాని
యీయింతిఁ గొని వచ్చు టెఱిఁగిన నన్ను
బోయినప్పుడే తలపుచ్చుక మ్రింగుఁ
గావున నిప్పు డీక మలాక్షి వార్త
నీవు ముందఱనేఁగి నేర్పు సంధిల్ల
జననాథుఁ డొక్కఁ డీసతి దాగ వోసె
నొనర నొజ్జుల కని యొడఁబడ మొఱఁగి
నావధూమణికి సంతసము వుట్టించి..........................1020
వేవేగ నాలోని వెఱ పెల్ల మాన్పు'
మని వేడుకొనుటయు నవ్వటుధూర్తు
మనసులో వేరొక్క మతము చింతించి
‘విరసంబు వుట్టించి వీనికి వీని
తరుణికి నొక మరి తలపట్లు చేసి
మొగములు వగులంగా మొత్తు లాడించి
నగుచుఁ జూచెదఁగాక నా కేమి' యనుచుఁ
గపట మేర్పడఁగ 'నౌఁ గా'కని పోయి
చపలాత్ము'డాయొజ్జసాని కి ట్లనియెఁ
జేరి నీ రోకమాటఁ జెప్ప వచ్చితిని.........................1030

....................................................................................................

పుట్జ, సంధిల్లన్ = కూడికొనఁగా, జన నాధు.... జలకు = ఒకానొక రాజు ఈ స్త్రీని ఉపాధ్యాయులకు దానము చేసెను, ఒడఁబడన్ = సమ్మతించునట్లు, మొఱగి ఏమరించి, వధూమణి= భార్యారత్నము, వెఱపుణభయము, .వటుధూర్తు= ధూర్తుఁ డైనపడుఁగు, 'వేపొక్కమతము= మఱియొక యభిప్రాయము - తనగురు వుచెప్పినది గానట్టి వేఱుభావమును, విరసంబు .... తరుణికి = వీనినితరుణికిని విరసంబు పుట్టించి' అనియన్వయము. మొత్తులాడించి . = ఒకరినొకరు మొత్తు