పుట:Haindava-Swarajyamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

215

ద్వితీయభాగము.

భూవల్లభుని దేవిముఖము వీక్షించి
'యోసి న న్ని బ్బంగి నోడక గ్రుద్ది.............................980
గాసి పెట్టెడుపలుగాకుల నెల్ల
దలవరు లరు దెంచి దండింప కుండఁ
దొలఁగి పొమ్మని పాఱిఁ దోలంగఁ దగునె
యింటివారిని లేపి యీవల దొంగ
బంటుకుఁ జెయ్యిచ్చు పాపాతురాల
వరువుగా నిన్నెట్లు వచ్చు సమ్మగను
బరుసనిమాటలపని యిప్పు డేల
నిల్లుఁ జేరినమీఁద నీపగ యెల్ల
వెళ్లింప కున్న నే విప్రుండ నఁట వె'
యని పగఁ జాటుచు నాధూర్తవటులఁ.............................990
గినిసి తిట్టుచుఁ దనగృహమున కేఁగి
తలసాల నిలుచున త్తరి నెట్టయెదుటఁ
బెలుచఁ దుమ్మిన భీతిఁ బ్రిదులుచు నిలిచి
చింతించు చున్నంత శిష్యుఁడు వచ్చి
సంతసంబున నమస్కారంబుఁ జేసి
నడుఁకుచుఁ జేరి ముందఱ నున్న శిష్యు
వడుగు నల్లప్పటి వడిఁ దుమినట్టి

.......................................................................................................... చ్చెనని జాగ్రత్తపఱుప లేపి తుద కాదొంగ చేతి కే పట్టియిచ్చు పాపిష్ఠి దానా వ రుసనిమాటలపని= పరుసుగా మాటాడవలసినయక్కఱ, వెళ్లింపకున్న = తీర్చుకొనకు న్న, ధూర్తవటులు=దుర్మార్గు లైస వడుగలు,తలసాల= తలవాకిలి,ఎట్టయెదుటన్ = మిక్కిలియెదురుగా, పలుచన్ = గట్టిగా ప్రిదులుచున్ = సడలుచు= బిగితప్పి విరవిరవోవుచు, నడుఁకుచున్ =వడఁకుచు, అల్లప్ప... వానరునిన్ = తలసాల