పుట:Haindava-Swarajyamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
212

హరిశ్చంద్రోపాఖ్యానము

వెన్న ముద్దకు రూపు వెట్టినమాడ్కి
నున్న మెత్తని మేను నొప్పెడువాఁడు
యెన్న డు నెండఁ గన్నెఱుఁగనిశిశువు
గన్ను ల ముత్యాలు గాజు నేడ్చెడిని
నే చెల్ల నో యమ యీ చక్కనన్న
రాచ తేజము గలరత్నాల పెట్టె
నడవ నెట్లో ర్చెనే నా ముద్దుఁజిలుక
కడుపుఁ జురుక్కనుఁ గన్న వారికిని
వీఁ డొక్క తెరబొమ్మ విప్రవృశ్చికము..............................930
పీడించి వీరి నొప్పించు చున్నాఁడు
కాలఁగాఁ జిక్కిన కాష్ఠంబువంటి
కా లీచఁ బోయిన కట్టిఁడి మాల
చందురంబులును బుస్తకమును గోపి
చందనంబులును జూచి చనదుసూనమ్మ
నెందును బురిలోన నెప్పుడు మెలఁగు
బంది కాండ్రకు నివి పరఁగుచిహ్నములు'

..................................................................................................................


భీంపవలసియున్న యీ బాలునిఁ జూడుఁడనుట, వెన్న... మేను= వెన్న ముద్దను దెచ్చి బాలునిరూపముగాఁజేసినట్లు ఈ బాలుని మేను మిక్కిలి మెత్తనై నిగనిగ లాడుచు చూచుటకు అతిభోగ్యము గానున్నదనుట, కన్నుల ముత్యాలు గాఱన్ = ముత్యములవలె కన్నీటి బొట్లు కాఱగా, నే చెల్ల = నేను సహింప నే, రాచ తేజము =రాజ తేజస్సు, తెరబొమ్మ =వెఱుబొమ్మ,విప్రవృశ్చికము=బ్రాహ్మణరూపముననుండు తేలు, కాలగాన్.= కాష్టంబు= కొంచెము కాలి కొంచెము కాలక యున్న కట్టెట, కాలు ఈ చఁబోయిన కట్టిఁడి = ఈఁచబోయిన కాలుగలు కఠినుఁడు, మా చందుకములు= సిందూరములు, బంది కాండ్రకు=బందిపోటు దొంగలకు, ముక్కు