పుట:Haindava-Swarajyamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

211

మడఁ బెట్టి యాచంద్రనుతి నెత్తికెత్తి
'మురి పెంపుఁబని లేదు ముందు నింక
సరగున నింటికి జరుగు లె'మ్మనుచుఁ
దన వెంట విప్రుఁడు తఱుముచు నడవఁ
దనయుముద్దుల కేలు దన కేలం
చెక్కుల సన్నంపుఁ జెమ రెక్క నడుము
నుక్కట నొక్కింత నూఁగారు దోఁప
నలరుపయ్యెద జాఱ నలకలు చెదర..................................910
నులివాళ్లు వాఁడి తనూలత సోల
నలయుచుఁ జనుచున్నయా మచ్చెకంటిఁ
గలయ వాడలఁ బుణ్య కొంతలు సూచి
వగలఁ గుందుచు బాష్పవారి బిందువులు
దెగినముత్యంబుల తెఱుఁగునఁ దొరుఁగఁ
“గటకటా! భార మెక్కడ నుండి వచ్చె
గిటగిట నై నయీ కీరవాణికిని
గచభార మోర్వనికంఠ మాధాన్య
నిచయ భారమునకు నిలువ నెట్లో ర్చె
నేల దీనికి గుంద నిటు చూడరమ్మ......................................920
వేలి నొయ్యనఁ బట్టి వెనుకొని వచ్చు

...........................................................................................................

మడతఁబెట్టి=మడిచి, మురి పెంపుఁబని=సొగసుకులుకుతోఁగూడిన సుకుమార మైన పని, నడుమునుక్కటన్ = నడుముయొక్క చలనము చేత, నులివాళ్లువాఁడి = కొంచెమువాఁడి, తనూలత = తీఁగవంటి మేను, మచ్చెకంటి = చేపలవంటికన్ను 'లు గలది, గిటగిట నై న = మిక్కిలి కృశించిన, కీరవాణి = చిలుక పలుకులు వంటి పలుకులుగలది, కచభారము కురుల బరువు, నిచయ= సమూహము, ఏలదీనికి, గుందన్ = ఈయాఁడు దానికి దుఃఖింప నేల - అనఁగా దీనికంటె నెక్కువ ద్యు