పుట:Haindava-Swarajyamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
210

హరిశ్చంద్రోపాఖ్యానము
కసి బెండపువ్వులగతి రాసి మోసి
పొసఁగునావాతన పొక్కు 'లెన్ని తివి
చేతిత డాటి దుచ్ఛిష్టపు లేమ.................................890
రిబాతి యే నీవంటి బానిసె లెచటఁ
గండ క్రొవ్వున నన్నుఁ గైకొని రాక
మెమొ డొగ్గెదవు మందెమేలముల్ మాను'
మనుచుఁ బట్టఁ దలంచి చూపువ్వుబోఁడి
తనకు మొక్కుచు: బోణితలముల నొగ్గ
బెలుచ నెత్తురులు సిప్పిలఁ గోల మొ త్తి
తలకొన్న కోప మంతటనిల్పలేక
వెఱచి వాపోవుచు వెసఁ బాఱి తండ్రి
మఱుఁగుఁ జొచ్చినసుకుమారుఁ గుమారుఁ
గుదికిలఁ బడ రెట్టఁ గుదియించి తిగిచి....................900
యదరంట మొ త్తి నోరడఁగ జంకించి
పెడమూటలన్ని యుఁ బెనుమోపు గాఁగ

................................................................................................................

=సంపాదించినట్టి, నాహతన పొక్కు లెన్ని తివి నానోట నే మన్ను గొట్టం జూచితివి; చేతితడి ఆఱదు ఉచ్ఛిష్టపు లేము.= ఎంగెలిదానా నిన్ను న చేతి తడికూడ ఆరిపో లేదు. ఒకరు పెట్టినభోజనముఁదిని కడిగన చేయి తడి యాఱకమును పే వారియెడ ద్రోహము తలఁచునట్లు నిన్ను దీసిన క్రొత్త తీయక మును పే ద్రోహము తలఁచెదవాయనుట, బాఁతియే= హెచ్చా, మెండు ఒ గ్గెదవు= మిక్కిలియు ఊఁ గెదవు, మందె మేలములు= చనవులు, ఒగ్గన్ = చాఁచఁగా, చిప్పిల = కాఱునట్లు, తలకొన్న = రేగిన, అంతట నిల్ప లేక - అచంద్రమతిని గొట్టినమాత్రముతో విడువఁజాలక , కుదికిక లఁబడన్ = మొగము పై నెత్తుకొని "నేల మోవ గొంతు ,గూర్చుండు, నట్లు అదరంటన్ =పూర్ణముగా, నోరు అడఁగన్ జం కించి=నోరెత్తి ఏడువకుండునట్లు బెదరించి, పెడమూటలు = పెద్ద మూటలు