పుట:Haindava-Swarajyamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

209

బాపు పతివ్రత బాపురే గోల
బాపురే గుణవతి బాపురే ముగుద
విడువు మీ దేశాలివిద్య లొజ్జలకు
బడిత పాఠము దొంగ పదరు లన్నియును
మిఁక నేమరించినెఱిఁగితి నీ మర్మ
యురికి పోఁ జూచెద వూడ నీ వెనుక
దక్కితి వని నమఁ దగదు నిన్నె పుడు.......................880
గుక్కకూఁతుర మెడఁ గోసి పోఁగలవు
రెండు పోనాడిన రేవనిరీతి
నుండ బాలకు నిన్ను నోరంత ప్రొద్దుఁ
గీలుసం కెలఁ గేలఁ గీలించి వీపు
ప్రీలంగఁ గొట్టుదు వెఱుపు లేకున్న
గోఁచి గట్టిననాఁటఁగోలె వీనుఁగుల
నోఁచి గడించినమూలధనంబు


.........................................................................................................

బాపు పతివ్రత = నెబాసు పతివ్రతయఁట, బాపు రేగోల = సెబాసు ఏమి తె లియనిదఁట, బాపురే = సెబాసు గుణములుగలదఁట, బాపు రేముగుద= సెబాసు ముద్దరాలఁట, ఈ దేశాలివిద్యలు=నీ దేశములో కఱచిన యీవిద్యలు, ఒజ్జలకు నీకుఁ గఱపిన వానికి, విడువు=పదలి పెట్టుము - నాయొద్దజూపకుమనుట, బడిత పాఠము = చదివినపాఠము, 'దొంగ పదరులు అన్నియను బడితపాఠము', అని యన్వయము, దొంగ పదట ఫుమాటలన్నియు నే నీవు నేర్చిన చదువులు గాని మరిమంచివి ఏవియుఁ గావనుట, ఊడ నీ వెనుక = నీ వెనుకను విడిచిపోవును - నిన్ను వెంటనంటుచు నే కాచియుందుననుట, రెండుపో నాడీన రేవనిరీతి = రెంటికిఁజెడ్డ రేవనివ లె-ఇదియొక సామెత, ఉండ = ఉండను, ఓరంత ప్రొద్దు= రేయుంబగలు, కేలక్ కీలించి = చేతులకుఁదగిల్చి, గోఁచిగట్టిన నాఁటగోలె= తెలివి పుట్టినది మొ దలుగా - మొట్టమొదట పసితనమున తెలివి పుట్టినది మొదలు గాననుట, గడించి