పుట:Haindava-Swarajyamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
200

హరిశ్చంద్రోపాఖ్యానము

నావుడు వివ్రుఁ డానర నాథుఁ జూచి
“నీవు సెప్పినమాట నిక్క మంతయును
గోవు విల్వఁగఁ జన్నుఁ గుడి చెడి కేఁపు
గోవుతోడనె జట్టిఁ గూడి రావల దె
యక్కఱ దీ రెడునం దాక ధనము....................720
నెక్కడఁ గొని వత్తు రెవ్వరెందైన
నోడక నమముల కోర్చి యీ కల్ల
లాడంగ మా జంఘ లదురు చున్న వియుఁ
జక్క నీ వచ్చిన బాడఁ బొ మింక
జిక్కఁడు కాలకౌశికుఁడు నీ చేత
యిచ్చి నాచేఁ గొన నీశుండు నోపఁ
డచ్చి నా యెదుర బ్రహ్మకుఁ బోవ రాదు
పురిలోన బందెలపో తీతఁ డనఁగఁ
బరఁగ నా పేరిఁ జెప్పఁగ మున్ను వినవె


గన్ =అమ్మగా, జట్టిఁగూడి రాజులదే =వెలలోఁ జేరిరావలదా - ఆవు వెలలోనే దూడ వెలయుఁ జేరిపోయినదనుట, అక్క,ఱ ... రెం దైన్ = ఎక్కడఁగాని ఒక్కరియప్పునిర్బంధము తీఱునంతవఱకును వారికిఁ గావలసినంత ధసము ఎవ్వరు గాని ఎక్కడనుండి కొని పచ్చియియ్యఁజూలుదురు-నీ కెంతయప్పో అంతధనము నా కియ్యం దరము గాదనుట, అఘములకున్ = పాపములకు -అబద్ధమాడు టవలనఁగలుగు పాపములక నుట, జంమలు=పిక్కలు- నీయొద్దనుండఁగూడక వేగ పోవలయునని నాపిక్క లదురుచున్న వనుట, చక్కన్ =సరిగా, ఇచ్చి నా చే గొనక్ = నాకు ఒక టియిచ్చివై చి మరలదానిని నాయొద్దనుండి తీసికొనుటకు - నీకొడుకును నాకిచ్చివై చి మరలవానిని దీసికొనిపోవుట కవిభావము,అచ్చి = అప్పు పడి, బండెలపోతు= చెఱ పెట్టుస్వభావముగలవాఁడు, కాలదట్టింతు = కాలితో