పుట:Haindava-Swarajyamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

199


ఘనకుచంబులు రాయఁ గౌ నసియాడఁ
దను వెల్లగంపింపధైర్యంబు వదల
దివుటమై బెబ్బులి ధేనువుఁ బట్టి
గవిఁ జేరఁ గొనిపోవు కై నడిఁ దోఁప
నాలు గేనడుగులు నడవ నీడ్చుటయు........................700
బొలవత్సము ఛాలెఁ బాయక వెనుక
దగిలి వాపోవుచుఁ దల్లిఁ బో నీక
బిగియఁ పయ్యెదకోంగుఁ బెనఁచి చే పట్టి
యాక టఁ జంటి కర్రాడుచు ముద్దుఁ
గూఁకటి తూఁగాడఁ గునియుచు నున్న
సుతు లోహితాస్యునిఁ జూచి భూపాలు
డతిదుఃఖ తాత్ము డై యశ్రువు లొలుక ఁ
దాలిమి వదలి గదదకంఠుఁ డగుచుఁ
గాల కౌశికునితోఁ గదిసి యిట్లనియె
‘నెలమి ధేనువు విక్రయించుచోఁ గ్రేఁపుఁ......................710
దొలఁగింతు రే తల్లిఁ దొలఁగఁగాఁ జేసి
నాకులభూషణు నాకూరి పట్టి
నీకోమారునిఁ గొను మిచ్చెద నీకు
విలువ వీనికి వేయి వేలు నిష్కములు
నల నొప్ప నొసఁగుము వసుధామ రేంద్ర

............................................................................................................. ఒకటితో నొకటి యొర సికొనఁ గా, ఆసియాడమ్ =అల్లలాడగా", అవుట మైకన్

కోరికితో, గవిన్ - గుహను, బాలవత్సము = పసిదూడ, వాపోవుచు

ఏడ్చుచు, అట్టాడుచు= ఆతుర పడుచు,తూఁగాడన్ = చలింపఁగా,కునియుచు = ఆఁకటి చే చక్కఁగానడవలేక కున్సియడుగులు పెట్టుచు, కేఁపు= దూడ, తల్లి దొలఁగఁగాఁజేసి కేఁపుఁ దొలఁగింతు రే, అని యన్వయము, విలువ= వెల, విల్వ