పుట:Haindava-Swarajyamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
198

హరిశ్చంద్రోపాఖ్యానము

మాకుఁ దోఁచిన దొకమాటఁ జెప్పి తిమి
కాక నీమతి కింతకంటకం బైన
హితవుఁ జెప్పంగ మాకేల నీ కెట్టి..................................680
గతి వుట్టఁ గల దట్లు గానిమ్ము మీఁద
నాలి నంగడిఁ బెట్టి యమెడు నీకు
జాలి లేదఁట మాకు సంతాప మేల
కోరినధన మెల్లఁ గొమ్మని యెల్ల
వారును జూడ సువర్ణ నిష్కములు
రూపించి చౌకంబు ద్రోచి చెల్లించి
భూపాలునకు నిచ్చె భూసురో త్తముఁడు
వలనొప్ప ముఖపద వాసన కెగరు
కలికితుమ్మెదల రెక్కలగాలి: గదలి
తిలకించుచంద్రమతీ దేవికురులు...........................690
బలువిడిఁ గృపమాలి పట్టి రాఁ దిగిచి
పాపట నేటి దప్పం బయ్యెద జాలు
వీఁపున నెటివేణి విరిసి తూఁగాడఁ
బదములు దొట్రిల్ల బొష్పముల్ రాల
వదనంబు సెమరింప 'వాతెఱ గంద

లేక ప్రవాహమువలె ఎడ తెగక వదరునట్టిమాటలు, తలము-తొలఁగిపొమ్ము, కంట కంబు = అసహ్యము, నీ కెట్టిగతి... మీఁద = నీకుమీఁద ఏగతి రానున్నదో యబ్లె యదియగుఁగాక మాకేమి, చౌకంబుడ్రోచి = నాలు గేసిగా ఎంచి, ముఖప ద వాసన-మోము దామర యొక్క తావి, కలికి=నీటు, తిలకించు = తళుకొత్తు, కురులు=తల వెండ్రుకలు, బలువిడి = బలవంతముగా, తిగిచి= ఈడ్చి, నెటిదప్పక్ = తీరు చెదరఁగా, తొట్రిల్లర్ = తడఁబడఁగా, వా తెఱ= పెదవి, రాయక్ =