పుట:Haindava-Swarajyamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

201

కాలరుద్రుని నైనఁ గాలుని నైన................................730
కాల మృత్యువు నైనఁ గాల దట్టింతుఁ
బురుషుఁ డెవ్వఁడు నీకుఁ బూని న న్ని చట
నరుదుగా నౌను గా దనువాడు గలఁడె
వీఁడు నాదాసుఁడు వెలఁది నాదాసి
యేడఁ బుత్రుని నమే దిఁకఁ జెప్పు' మనిన
విని యప్పు డాధూ రవిప్రునితోడ
మను జేశుఁ డలుక తో మఱయు నిట్లనియెఁ

గొనియాడఁ దగువి ప్రకులమునఁ బుట్టి
చనునె నీకిట్టియసత్య వాక్యములు
ప్రొద్దున లేచి నీ మొగముఁ గల్గొనిన..........................740
యద్దినంబున వచ్చు నాపద లెల్ల
ని న్నొకవిప్రుని నిందింప నేల
మిన్నక తలపోయ మేదినిలోనఁ
గూడు నడ్డికి నిచ్చి కూర్చెడివారి
జాడ లిట్టివియె యాశ్చర్య మేటికిని
గులము ప్రధాన మే గుణము లేకున్న
గలశాబ్ది బుట్టదె కాలకూటంబు
వెడమాట లన్నియు విడిచి వే యిప్పు

డడిగిన ధనము సయ్యనఁ జౌక మెన్ని


...........................................................................................................

దన్ని వై తును, నీకుబూని= నీకుఁ గావచ్చి, ఔను గాద నెడి వాఁడు = లేదుకద్దని చెప్పఁగలవాడు, కూడుపడ్డ కిక్ = కూడెడునట్టివడ్డికి, కూర్చెడి వారి= ధనము గూర్చెడి వారి, కలశాభి = పొలసముద్రము, కాలకూటము = హాలాహలము, వెడమాటలు= వెట్టిపలుకులు, చౌక మెన్ని = నాలు గేసిగా లెక్క పెట్టి, కాఱులు=