పుట:Haindava-Swarajyamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
14

హైందన స్వరాజ్యము.

భూమి యుత్తమపుత్రులలో కొందరు ఇప్పుడు ప్రవాసములలోనున్నారు. వట్టి అర్జీలు పెట్టుకొనుటకును దీనికిని ఎంతో తారతమ్యమున్నది. ప్రజలీ విధముగా మారినారు. బంగాళములో పుట్టిన నవశక్తి ఉత్తరమున పంజాబుకు, దక్షిణమున కన్యాకుమారికి వ్యాపించినది.


చదువరి: మరి యేస్ఫుటమైన ఫలమైనను కలిగినదందురా?


సంపా: బంగాళావిభ జనము ఇంగ్లీషు నౌకలో రంధ్రముతొలచుటే కాక మన నౌకలో కూడ రంధ్రమును తొలచినది. మహాసంభవములకు మహాఫలములు దప్పవు. మన నాయకులు రెండు కక్షులయినారు―మిత వాదులు జాతీయవాదులు. ఒకటి మందగామి మరియొక్కటి శీఘ్రగామి యునవచ్చును. కొందరమతమున మితవాదులు భయస్థులు, జాతీయవాదులు పోటరులు. ఎవరి యెవరి ఆలోచనులు బట్టి వారు వారు వీనికర్థము చెప్పుదురు. ఒక్కటిమాత్రము నిజము. ఈ రెండు తెగలవారికిని వైరుధ్యము గలిగినది. పరస్పరము అవిశ్వాసపడుచు ఈ రెండుకక్ష కొండొంటిని చూపించుకొనుచున్నవి. సూరతు దేశీయమహాసభ సమయమున రమారమి యుద్ధ మేపొసగినది. ఈవిభేదము దేశమునకు మంచిది కాదనియే నాయభిప్రాయము కాని ఇట్టి విభేదములు ఎంతోకాలము నిలుచునవియు గావు.