పుట:Haindava-Swarajyamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంగాళా విభజనము

13.

దీని నెరుంగుదురు. అధికారులు దీనిని గుర్తించినారు. అందుచేతనే బంగాళావిభజనము బోలేదు. కాలక్రమమున హైందవ జాతి బలవత్తరముగ ఏర్పడుచున్నది. రాష్ట్రములొక్కనాట నిర్మితములు కావు. సంవత్సరములు పట్టును.


చదువరి: బంగాళా విభజన ఫలము లేమి యని మీయభిప్రాయము.


సంపా: నాటివరకు మనకు తెలిసియుండినదిది. మనకష్టనిష్ఠూరాలు తీర్చుకొనుటకు మనము చక్రవర్తిగారి వరకు అర్జీ చేసుకోవలసినది. ప్రతీ కారము లేకపోయిన ఎడల కూర్చొని మరల మరల అర్జీ చేసుకోవలసినది. బంగాళా విభజనకు తరువాత ప్రజలకొక సంగతి తెలిసినది. అర్జీలకు బునాదిగా మనశక్తి ఏర్పడ వలెను. మనము కష్టపడుటకు వెనుదీయరాదు. ఈక్రొత్త తేజస్సే విభజనము యొక్క ముఖ్య ఫలము. ఈఫలము నిర్భయముగా పత్రికలలో ప్రకటిత మైనది. ప్రజలు లోలోన రహస్యము రహస్యముగా గుజగుజలాడుకొనినది బహిరంగముగా నిర్భీతిగా వ్రాయంబడినది. ప్రకటన నందినది. స్వదేశోద్యమము ప్రారంభ మయినది. ముందు పిల్లలు పెద్దలు అంగరు ఇంగ్లీషువారిముఖము చూచిన భయము పరుగెత్తు చుం ఇప్పుడా భయము పోయినది. తగాదావచ్చినను ఇప్పుడు లక్ష్యము లేదు. జైలుకుపోవలసినను లక్ష్యములేదు. భారత