పుట:Haindava-Swarajyamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము.


అసంతృప్తి, అశాంతి.


చదువరి: అట్లైన బంగాళావిభజనము ప్రబోధమునకు కారణమని మీరంగీకరించుచున్నారు. అందువలన కలిగిన అశాంతి మీకు సమ్మతమేనా?


సంపా: నిద్రనుండి మేల్కాంచునాడు అంగమును విరుచుకొనుచు లేచును. ఆవల ఈవల పొర్లాడును. పూర్తిగా లేచునప్పటికి ఒక కొంతసేపు పట్టుచున్న ది. అటులే బంగాళావిభజనము ప్రబోధము కలిగించినను మేల్కొనుటకు సంబంధించిన వికారములు మాత్రము వీడలేదు. ఇంకను మనము అంగములు విరుచుకొనుచు ప్రక్కపై పొరలుచునున్నాము. నిద్రకు జాగ్రత్తకు మధ్యమావస్థ ఎట్లనసరమో అట్ల యీయవస్థయు మన పరిణామమున అవసరము ఉచితము అగుచున్నది. 'అశాంతి కలదు.' అను జ్ఞానమే దానిని తరించుటకు మార్గము కాగలదు. నిద్ర మేల్కాంచట కారంభించిన పిదప అరగను మోడ్చుతో నెంతో కాలముండము. త్వరగానో కొంచెమాలస్యముగనో మనమన శక్తికొలది సంపూర్ణజాగ్రవవస్థను పొందుచునే యున్నాము.