పుట:Haindava-Swarajyamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

159

ద్వితీయ భాగము.

డట చని ముందట నా వేల్పు చోటి
తటమున నురుతరద్వారక వాట
వాపీతటా పవనసముత్తుంగ
గోపుర ధ్వజ మణి కుడ్య విచిత్ర..........................50
తోరణ ప్రాసాద తురగ మదాంధ
వారణ రథ భట వ్రాత సామగ్రి
జెన్నొందు చున్న కాశీపురిఁ జేరి
కన్నులు విలసిల్లఁగా మహీవిభుఁడు
ముదమునఁ దన దేవిమోము వీక్షించి
మదిరాణి యిందులమహీమ వర్ణింపఁ
బదినూఱుముఖములఫణియును జాలఁ
డిది వేదవిఖ్యాత మిది ముక్తిమార్గ
మిది స్వర్గసోపాన మిది సిద్ధ సేవ్య
మిది దోషచయదూర మిది తీర్థ సార
మిది భుక్తిముక్తిద మిది సత్యచరిత.........................60

...............................................................................................

వేల్పుటేటితటము- దేవనదియైనగంగగట్టు, ఉరుతర... సామగ్రిన్ - ఉరుతర = మిక్కిలిగొప్ప దైన, ద్వారక వాట= ద్వార పుతలుపులును, వాపీ వడ బావులును, తటాక = చెఱువులును, ఉపవన =తోఁటలును, సముత్తుంగ గోపుర పొడవైన గోపుగములును, ధ్వజ = ధ్వజములును, మణికుడ్య = రత్నమయ మైనగోడలును, విచిత్ర = వింత లైన, తోరణ-ముఖద్వారములును, ప్రాసాద = మేడలును, తురగ =గఱ్ఱములు, మదాంధ వారణ=మదము చే కన్ను గానని యేనుఁగులు, రథ=రథ ములును, భటవాత = బంట్ల సమూహములును, సామగ్రిన్ = వీనియొక్క సంపూర్ణ త చేత, దోషచయదూరము= దోష సమూహములకుదవ్వయినది - దోషముల నెల్ల పోగొట్టునది. తీర్థ సారము = శ్రేష్ఠ మైనతీర్థము. భుక్తిముక్తి దము= భోగ మోక్ష