పుట:Haindava-Swarajyamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
158

హరిశ్చంద్రోపాఖ్యానము

సరవిఁ బెల్లెసఁగెడు జలకణ పంక్తు
లరు దారుమా క్తికహారముల్ గాఁగ
నవలఁ గ్రీడించు రాయంచలరవము
నవ హేమనూపుర నాదంబు గాఁగఁ
బెనుపొంద నెరసిన ఫేనంబు దెలుపు
దనరారు చున్న చందనచర్చ గాంగ
గూలావనీరుహకుసుమపరాగ
జాలంబు చిత్రవ స్త్రంబుగా మెఱయ
జనలోక పావని జాహ్నవి గంగఁ
గనుఁగొని హ స్తపంకజములు మొగిచి...................................40
నుదుటఁ గీలించి సన్నుతు లొప్ప భక్తి
గదిసి నందనుఁడును గాంతయుఁ దాను
నాపుణ్యవాహినియం దవగాహ
మోపికఁ గావించి యుచి తాహ్నికములఁ
గ్రమమునఁ దీర్చి యక్కడఁ గొంత సేపు
శ్రమము దీరఁగ నిల్చి జననాథతిలకుఁ

...................................................................................................

వెల్లువ, నెఱి వేణి గాఁగ = నిండారుజడ గాగా, పెల్లు= మిక్కి గా, జలకణపం కులు=నీటిబొట్ల వరుసలు, అనుదారుమౌ క్తికహారముల్ = వింతయైనముత్యపునరు లు, నవ హేమనూపుర నాదము=క్రొత్తబంగారంవియచప్పుడు, పెనుపు = పెంపు, నెరసిన ఫేనంబు దెలుపు= వ్యాపించిన నురుఁగు తెల్లఁదనము, చర్చ పూఁత, కూలా... జాంము- కూల= గట్టునందలి, అవనీ రుహ = చెట్ల యొక్క కుసుమపరాగ = పుప్పొడి యొక్క,జాలంబు = సమూహము, గంగ ను ఇంతవఱకొక స్త్రీ గావర్ణించి నాడు. జనలోకపావని = భూలోకమును పవిత్రము చేయునది, జాహ్నవి - జహ్ను మునివలనఁ బుట్టినది, నందనుఁడు=కొడుకు, పుణ్యవాహిని - పవిత్రమగు నది, అవగాహము=స్నానము, ఉచిత ఆహ్నికముల = తగినట్టి పగటికర్మములను,