పుట:Haindava-Swarajyamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగలక[1] మునినాథునప్పున కొక్క
తెగ[2] సేయ వలయు నో దేవి యె ట్లైన'
నని కుమారునిఁ దనయంస మె[3]క్కించు
కొని యట పోవుచోఁ గొంత దవ్వులకు
నరుణారవిందంబు[4] లడుగులు గాగ
దరుల[5] గ్రుమ్మరువనదంతావళముల[6]
యురుతరతుండంబు[7] లూరులు గాఁగ[8]
సరససైకతసీమ[9] జఘనంబు[10] గాఁగ
సురుచిరం[11] బగుమేటి[12]సుడి నాభి గాఁగఁ
గర మొప్పుచిఱుతరఁగలు[13] వళుల్[14] గాఁగ
నునుఁదీగనాచు[15] లేనూఁగారు[16] గాఁగ
నెనయ జక్కవలు పాలిండ్లును గాగ
జెలువంపుబిసములు[17] సేతులు గాఁగ
వెలిదమ్మి[18] వదనారవిందము గాఁగఁ
గలికిబేడిసలు[19] వాల్గన్నులు[20] గాఁగ
నెలకొన్నజలవేణి[21] నెఱివేణి గాఁగ[22]30

  1. అగలక = వెనుదీయక
  2. తెగ = విధము
  3. అంసము=మూఁపు
  4. అరుణఅరవిందంబులు = ఎఱ్ఱదామరలు
  5. దరుల =గట్టులందు
  6. వనదంతావళములు=అడవియేనుఁగులయొక్క
  7. ఉరుతరతుండములు = మిక్కిలి గొప్పవైన తొండములు
  8. ఊరులు గాగన్ = తొడలు కాఁగా
  9. సరససైకతసీమ = ఒప్పిద మైనయిసుకదిబ్బపట్టు
  10. జఘనము=కటి
  11. సురుచిర = అంద మైన
  12. మేటి=గొప్ప
  13. చిఱుతరఁగలు=చిన్నయలలు
  14. వళుల్ = కడుపుమీఁదిముడుతలును
  15. నునుఁదీఁగనాచు=నిద్ద మైనపాఁచితీగ
  16. లేనూఁగారు= లేఁతయైననూఁగారు
  17. చెలువంపుబిసములు= అందమైన తామరతూండ్లు
  18. వెలిదమ్మి= తెల్లదామర
  19. కలికిబేడిసలు= ప్రకాశించుచున్నబేడిసచేఁపలు
  20. వాల్గన్నులు = నిడుద లైనకన్నులు
  21. నెలకొన్నజలవేణి = నిశ్చలముగా నున్న నీటివెల్లువ
  22. నెఱివేణి గాఁగ = నిండారుజడ గాగా