పుట:Haindava-Swarajyamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
160

హరిశ్చంద్రోపాఖ్యానము


మిది శంకరక్షేత్ర మిట్టిచిత్రంబు
కంతునిరొజు రోసి కన్నులు మూసి
చింత లొక్కటిఁ జేసి శివుఁ దలపోసి
యల సంతతోల్లాస మందెడువాసి
గలిగించునీ కాని మన పుణ్య రాశి
వామాక్షి విప్రుని వధియించునతఁడు
కామాంధుఁ డై తల్లిఁ గదిసినయతఁడు
నుడుగక సురఁ ద్రాగు చుండెడునతఁడుఁ
దొడరి సువర్ణంబు దొంగిలునతఁడు.............................70
వనితల శిశువుల వధియించునతఁడుఁ
గినుక మై ధేనువుఁ గెడపినయతఁడుఁ
గొండీఁడు గృహదాహకుఁడు గరదుండుఁ
జండాలు డఖిలదూషకుఁడును మఱియుఁ
గ్రిమి పశు మృగ పక్షి కీటాది జంతు
సముదాయ మైన నిచ్చట మృతిఁ బొంది
మిన్నేరుజడలును మిక్కిలిగన్ను
ద్రౌన్నెలపువ్వును గుత్తుక నలుపుఁ
బులితోలు కా సెయుఁ బునుకకంచంబు

........................................................................................................


ములనొసఁగునది. కంతునికొఱ= మన్మథునితక్కువ, సంతతఉల్లాసము= ఎడతె గని యానందము, వాసి= మేలిమి - ఆధిక్యము, సుర=కల్లు, సువర్ణము= బంగారు, కెడపిన= చంపిన, కొండీఁడు=కొండెము చెప్పువాఁడు, గృహదాహకుఁడు= ఇంటికి నిప్పు పెట్టెడువాఁడు,గరదుండు=విషము పెట్టెడివాఁడు, అఖిల దూషకుఁడు=అం దతిరిని దూషించువాఁడు,మిన్నేరుజడలు=ఆ కాశగంగగలజడలు, మిక్కిలికన్ను =మూడవకన్ను కొన్నె లపుష్పంబు కొత్తచందురుఁడ నెడితలపువ్వును,కుత్తు కనలుపు=గొంతునందలినీలిమ. పునుకకంచము= తలపు ర్రపాత్ర, పలుఁద = వెడలు