పుట:Haindava-Swarajyamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
12

హైందవ స్వరాజ్యము.


సది వంట బట్ట లేదు. వారి ప్రార్థనలు నిరాకృతములయ్యెను. హైందవులు ఊరక వదరకలరుగాని కార్య 'మేమి చేయగలరని అతను పరాఙ్ముఖుడయ్యెను. అవమానకర భాషణము చేసి అత డు బంగాళమును విభజించెను. నాటిదినమును బ్రిటిషు సామ్రా జ్య విభజన దినమనుకొనవచ్చును. ఈ బంగాళా విభజనమున బ్రిటిషు అధి కారమునకు కలిగిన నష్టము మరి దేనివలనను కలుగ లేదు. హైందవ భూమికి జరిగిన ఇత రాన్యాయములు బంగాళా విభజనమునకంటే తక్కువవి యని ఇందువలన తలంపరాదు. ఉప్పు పన్ను చిన్న యన్యాయము కాదు. ముందుకు ఇట్టివింకను ఎన్నో యో వివరింతును. ప్రస్తుత మనుసరింతము. బంగళా విభజనమును ఎదుర్చుటకు ప్రజలు సిద్ధముగా నుండిరి.సంవే దనలు తీక్షణమయ్యెను. బంగాళీ లనేకులు తమ సర్వస్వ మును సమర్పింప సిద్ధమైరి. స్వశక్తి విజ్ఞానము కలిగినందున తైక్ష్ణ్తము అపారమయ్యెను. ఇప్పుడా తైక్ష్ణ్యైము అడంపరానిదై నది. అడంప నవసరమును లేదు, బంగాళా విభజనము పోవుట సిద్ధము. బంగాళీలకు పునస్సమాగమము సిద్ధము. "కాని ఇంగ్లీషు పరిపాలన నౌకలో ఏర్పడిన రంధ్రముమాత్రము మూతపడదు.. అది దిన క్రమముగా పెద్దది యగును. ప్రబోధితమైన 'హైందవ భూమి మరల సుషుప్తి జెందబోదు. బంగాళా విభజనము రద్దు చేయగోరుట స్వరాజ్యమును గోరుటయే. బంగాళ నాయకులు"