పుట:Haindava-Swarajyamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రక ర ణ ము.

బంగాళా విభజనము.


చదువరి : మీరు చెప్పు వైఖరిని ఆలోచించినయెడల దేశీయమహాసభ స్వరాజ్యమునకు బునాదులు వైచినదనుట న్యాయముగానున్నది. అయిన దానివలన నిజమైనప్రబోధము కలిగినదని అనుటకు రాదు. మీరును దీనిని అంగీకరింతు రనుకొనెదను. ఎప్పుడు ఏవిధముగా ఆ నిజమయిన ప్రబోధము కలిగినదో చెప్పుదురా?

సంపా : విత్తన మెప్పుడును ప్రకటముకాదు. దాని పని యంతయు భూగర్భమున జరుగుచున్నది. తరువాత విత్తనము నాశమందుచున్నది. విత్తనమునుండి బయలుదేరు వృక్షము మాత్రము పైకినిక్కి కానవచ్చును. దేశీయమహాసభసంగతిలో గూడ ఇట్టి స్థితియే కాననగును. అయినప్పటికిని మీరు ఏది నిజమైన ప్రబోధమని అనుకొనుచున్నారో అది బంగాళావిభజనమునకు తరువాత కలిగినది. అందులకుగాను మనము కర్జను ప్రభువునకు కృతజ్ఞులమై యుండవలసియున్నది. విభజనకాలమున బంగాళీలు కర్జనుగారికి సంగతిసందర్భములు విశదీకరించిరి. కాని అతనికి అధికార గర్వమున్నందున వారు చెప్పి