పుట:Haindava-Swarajyamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
10

హైందవ స్వరాజ్యము.


కాలేదు. దేశీయ మహాసభ యెట్లు స్వరాజ్యమునకు బునాది వైచినదో తెల్పుడు

. సంపా: చూతము. దేశీయమహాసభ భారతభూమి నాలుగు చెరగులనుండి దేశ పుత్రులను నొక్కచోట చేర్చెను. మనమం దర మొక్క జాతీయను నుత్సాహమును మనకు కలుగ జేసెను" ప్రభుత్వము వారికి ఆ సభ యెడల అసూయయే. దేశాదాయమును దేశ వ్యయమును ప్రజా ప్రతినిధులే నిర్ణయింపవలె నని ఎప్పుడును ఆసభ కోరినది. కనడాలోవలె ఇక్కడ స్వపరిపాలన యేర్ప డవలెనని యెప్పుడును అడుగుచు వచ్చినది. మనకు అది దొర కునా లేదా, అదేమంచిదా కాదా, దానికంటే మంచిది మరి యొకటి కలదా యిత్యాది ప్రశ్నలు ఇట అనవసరము. మనము గమనింపతగినది ఒక్కటే విషయము. దేశీయమహాసభ మనకు స్వరాజ్యముచవి ఇట్టిదనుటను ప్రకటించినదా? లేదా? ఆకీర్తి తత్సభకు లేక చేయుట నాయము కాదు. మనమును ఆప్రయ త్నము చేయుదుమేని కృతఘ్ను లమగుటయేగాక మనయు ద్దేశ పరిపూ ర్తినిగూడ దూరము చేసికొనిన వారమగుదుము. దేశీయ మహాసభ మసజాతీయాభివృద్ధికి విరోధియని యెంచుట దానిని మనము వినియోగించు కొనుభాగ్యము పోగొట్టుకొనుట యగును.