పుట:Haindava-Swarajyamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమభాగము.

147

నున్నది కళ్యాణి కొక్కింత యైనఁ
జె న్న రి యుండదు సీమంతవీథి
యలికంబు సెమరింప దలకలు గమర
వెలనవ్వు గడి వ దెసఁగదు దప్పి
చిలుకదు కన్నీరు జిగి దప్పి మేను
సొలయ దేమియుఁ బొగచూరదు వలువ
పసిమి దప్పదు కమ్మపసపు లేఁబూత
కసుగంద వడుగులుఁ గమరవుఁ జేతు
లీతగ వీ తెంపు నీ పెంపు సొంపు
లీ తెరంగీ మేర లీదిట్టతనము..................2320
లెందు మహాశ్చర్య మేమన వచ్చు
నిందుక ళా ధరుం డెఱుఁగు నొక్కరుఁడు
బాపురే నా తపోబలమునకంటే
దీపించు దీనిపాతివ్రత్య మహిమ
పతిభక్తి సతులకుఁ బరమశీలంబు
పతిభ క్తి సతులకు భాగ్యమూలంబు
పతిభ క్తిసతులకుఁ బరమభూషణము
పతిభక్తి సతులకు భాగ్యపోషణము
పతిభ క్తి సతులకు భయనివారణము

...........................................................................................................

వీధి = పాపట రేక, అలిక ము= నెత్తి, అలక లు=ముంగురులు, కమరవు= కాలవు, కడిపోవదు-= వాసన పోవదు- చెడిపోదు. చిలుకదు = తొరగదు-కన్నీరు కారదనుట. సొలయదు=బడలదు, పొగచూరదు వలువ=వస్త్రము మాఁడి పొగయదు, కమ్మపసపు లేఁబూత=మంచిపసపు పలుచగాఁబూసినపూఁత, కసు గందవు=కొంచెమైనను వాఁడవు, ఇందుకళాధరుఁడు = శివుఁడు, బాపురే