పుట:Haindava-Swarajyamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
146

హరిశ్చంద్రోపాఖ్యానము


యెలనవ్వు సిగురొత్త నెప్పటి యట్టు
లలవడఁ జేతు లల్లార్చుచు నెదుర
నలరి యాసండనృత్యముఁ జూపు చున్న......................2290
యాలోహితాస్యుని నక్కునఁ జేర్చి
పాలు చన్నుల జే(పి పయ్యెద దడియ
జడిగొని హర్షాశ్రుజలముల మేనిఁ
దడిపి ముద్దాడుచు ధవునకు నర్థి
నిలఁ జాఁగి మొక్కిన 'నింతి నీయట్టి
కులసతి నాకుఁ గల్గుటఁ గాదె యిట్టి
యాపద లెడఁబాసి యలరంగఁ గలిగె
నీపుణ్యవర్తన నెగడె లోకముల
నే రట్టుఁ దిట్టునా కెసఁగక యుండ
బోరన మునిపుత్రుఁ బ్రోచితి గాన.............................2300
నీనిమి త్తంబున నెలఁత నా కింక
బూని కౌశికుఋణంబును దీర్పఁ గలుగు'
నని యుచితోక్తుల నమ్మహీవిభుఁడు
తన దేవి ప్రియ మారఁ దగ గారవింప
నప్పు డాకౌశీకుం డవ్విధం బెల్ల
దప్పక వీక్షించి తద్దయు నలిగి
“కాలాగ్నిఁ బోనియీకార్చిచ్చు చేతఁ
గాలి వే భస్మంబు గాక తా నిలిచి
పతియును దాను నెప్పటియట్ల కలసి
సుతుని ముద్దాడుచు సురలు నుతింప .......................2310

........................................................................................................

యనుట - ఇది భాషా శైలి, ఎలనవ్వు = చిరునవ్వు, రట్టు=అపవాదము, సీమంత