పుట:Haindava-Swarajyamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
144

హరిశ్చంద్రోపాఖ్యానము


లని యెట్టకేలకు నాలోహితాస్యు
మను జేశుకడ నిల్పి మఱి యొండుదలఁపు
మది లేక నిల్చి యమగువ ప్రాణేశుఁ
బదిలంబుగా మనఃపద్మంబునందు
ధృతి నిల్పి చంద్రమతీ దేవి భ_క్తిఁ
బతిముఖం బై యగ్నిభట్టారకునకుఁ
దరుణ ప్రవాళ సుందర కాంతిఁ దనరు
కరపల్లవంబులు గర మొప్ప మొగిచి................................2260
'వరద వైశ్వానర వరదయాలోల
దురిత సముత్కరతూలవాతూల
మదిలోన వాక్కున మరి చేతలందు
వదలక పతిభ క్తి వరలుదు నేని
నరలోకనుతుడై ననాకూర్మివిభుఁడు
పరమసత్యంబు దప్పక మను నేని
పరమశీత లుఁడ వై ప్రాణదానంబుఁ
గరుణమైఁ దొలుత నక్షత్రున కొసఁగి
మునినాథుఋణమున మునిఁగి పోకుండ
మనుజేశుఁ గొడుకును మఱి కావు' మనుచుఁ ...........................2270
జెచ్చర రాయంచ చెంగల్వకొలను
జొచ్చినగతిఁ జిచ్చుఁ జొచ్చి యానడుమఁ


................................................................................................................

సొగ సైనచిన్న యెఱ్ఱని చేతితో, తరుణ ప్రవాళ సుందర కాంతిన్ = లేతచిగుళ్ల వంటి సొగసైన కాంతితో, దురిత ... తూల - దురితసముత్కర = పాపసమూహర సెడి, తూల = దూదికి, వాతూల= గాలియైనవాఁడా- గాలి దూదిని పింజేలుగా నెగురఁగొట్టునట్లు పాపసమూహమును నాశము సేయువాఁడాయనుట, కలయ