పుట:Haindava-Swarajyamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

145

ప్రథమభాగము.

గలయఁ బూసిన కింశుకంబులలోనఁ
జెలు వారు చున్న రాచిలుక చందమునఁ
బ్రబలసంధ్యా రాగపటలంబునందు
సొబ గొందు క్రొన్నె లసోగ బాగునను
మలసి మం డెడు పెనుమంటలలోన
నిలిచి మైఁదీఁ గె కాంతికి వన్నె నిగుడ
దీపింప రాని పాతివ్రత్య మహిమ
కేపార వెఱఁ గంది యెల్ల దేవతలుఁ.....................................2280
బొరిఁ బొరి నుతియింపఁ బువ్వుల వాన
గురి సె నప్పుడు వహ్ని గొబ్బున నడఁగ
నిగుడుకీలలు మాని నివురు పైగప్పి
పొగులుట లుడిగి నిప్పుకలు సల్లారె
నావిధంబునను దావాగ్ని సల్లారి
పోవుటయును మహాద్భుతముగా మెఱసి
తలపువ్వు వాడక తరుణీలలామ


.................................................................................................................

బూసినకింశుక ములు - అంతటను ఎఱ్ఱగా పూచియున్న మోదుగు చెట్లు, ప్రబల . . పటలమునందు = దట్టమైన సంజ కెంజాయలనమూహమునందు, సొబగు ఒందు-= అందగించునట్టి, క్రొన్నెలసోగ బాగునను= లేఁతయు నిడుద గానున్న చంద్ర రేఖ విధమున - ఇట చెంగల్వకొలను, పూచిన మోదుగు చెట్లు, దట్టంపు సంజ కెంజాయలు అగ్ని కిని, 'రాయంచ, రాచిలుక ,గ్రొన్నె ల సోగయనునివి చంద్రమతికి నిజెప్పి నాఁడని తెలియునది. మైదీఁగె... నిగుడ - తీగవంటి మేని కాంతికి యా యగ్నియందు మఱింత కాంతి హెచ్చఁగా, నిగుడుకీలలన్ = సాంగుచున్న జ్వా లలను, నివుఱు పైఁగప్పి =మండుటతీసి పైని నివుఱుగ్రమ్మి,పొగులుట= కుములుట. తలపువ్వు వాడక = తలయందలి పువ్వు సైతను కందక - ఇంచుకై నను కసుగందక