పుట:Haindava-Swarajyamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

143

ప్రథమభాగము.

తగవు మీఱుఁగఁ దెంపు దయ సేయు' మనుచు
వేఁడినఁ దల వేల వేసి నిట్టూర్పు
వేఁడి యై నృపతి నివ్వెర నూర కున్న
వసుధీశు నతిభ క్తి వలగొని మ్రొక్కి
మసలక చను చంద్రమతి వెంటఁ దగిలి
'యమ్మమ్మ నీ విపు డగ్నిలో నుఱుక
సమ్మదం బొదవంగఁ జనియెద వేని
వత్తు నేనును నన్ను వదలక తిగిచి
యె త్తికొ" మ్మనుచుఁ బెల్లెసఁగుదైన్యమున్న .............................2240
గిదుకుచుఁ జిన్ని కెంగేలఁ బై కొంగుఁ
గదియించి బుడిబుడి కన్నీరు దెచ్చి
మోహ మేర్పడఁ గుచంబుల మోము రాచు
లోహితాస్యునిఁ జూచి లోనన పొక్కి
యక్కునఁ గదియించి మాదల నివిరి
చెక్కిలి నొక్కి యాచిన్నారిబొజ్జ
బుడికి చక్కిలిగింత పుచ్చి కన్నీరు
దుడిచి ముద్దులచుంచు దువ్వి మూర్కొనుచు
'నాయన్న నాకూన నాముద్దుపట్టి
మాయయ్య యీ పేర్చుమంటఁ జల్లార్చి ...................................2250
వత్తు వేవేగ రావలదు నా తోడఁ
మారఁగ నీకుఁ జేకూరు శుభము”

..................................................................................................................

లోఁ బ్రవేశింపఁగా పిదప దైవము "కావించుదారి కాఁగలదు, తెంపుదయ సేయు ము= తెగువ చేసి యగ్ని లోఁబడుటకు అనుమతి యిమ్ము,నివ్వెఱు = మిక్కిలిభయము, వలగొని = ప్రదక్షిణము సేసి, కిదుకు చు= మెల్ల గాశబ్దించుచు, చిన్నికెంగేలన్