పుట:Haindava-Swarajyamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
142

హరిశ్చంద్రోపాఖ్యానము


వలయంబుగా మండి వచ్చు కార్చిచ్చు
కులికి యెందును వేళ నురికి పో రాక
సుడి వడి మనలోనఁ జొచ్చి వా తెఱలు
దడుపుచు నున్న యీత పసికుమారుఁ
గొంకక వెస నెత్తుకొని వెర వైన
వంక గా నీవహ్నివలయంబు గడపు
మీవు గల్గినఁ దీజు నీముని ఋణము
నీవు గల్గినఁ గల్గు నెలఁతలపొందు....................2220
నీవు గల్గినఁ బుత్రనివహంబు గలుగు
నీవు గల్గినఁ గల్గు నిత్య సౌఖ్యములు
నీవు గల్గినఁ గల్గు నిత్యధర్మములు
నీవు గల్గినఁ గల్గు నిఖిలభోగములు
నీవు గల్గినఁ గల్గు నిత్యనంపదలు
నీవు గల్గినఁ గల్గు నిఖిల రాజ్యములు
నెడ లేదు భాషింప నిదె చేర వచ్చే
మిడుఁగుజు లడరంగ మి న్నంది వహ్ని
తెగువ లేకున్నను దెగుట నిక్కంబు
సుగుణాత్మ తొలుత నేఁ జొచ్చినపిదప.....................2230
భగవంతుఁడొనరించు పద్ధతి జరుగు


....................................................................................................................


యపడి, వెళ్లనురి కి = వెడలదూఁకి, సుడివడి - తబ్బిబ్బుపడి, వా తెఱలు = పేడ వులు, వెరవై నవంక గా = వీలయినదిక్కుగా, నివహము = సమూహము, ఎడ లేదు భాషింపన్ = మాటలాడుటకు అవకాశము లేదు, మిన్నంది =ఆకాశముముట్టి. మిక్కిలిపొడవుగా పెరిఁగియనుట, తెగువ లేకున్న ను తెగుటనిజంబు = సాహసము చేయనియెడల చచ్చుటనిశ్చయము, తొలుత ...... జరుగు - మొదట నేనగ్ని