పుట:Haindava-Swarajyamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

141

ప్రథమభాగము.

విడివడఁ బ్రాణముల్ విడుచు నీశిశువు
సుతుఁడు నీవును జావఁ జూచి ప్రాణంబు
ధృతి నిల్పి యెట్లు వర్తింపఁగ వచ్చు .....................2200
వచ్చు నే నో రాడి వాక్రుచ్చి నిన్ను
జిచ్చులోఁ బడు మని చెలఁగి వీడ్కొలుపఁ
గరుణ మాలినయట్టికఠినాత్ము డైన
నరునిఁ బల్కిన నయ మేది నన్ను
బలికితి పలుకని బాష్పపూరంబు
నెలమి రెప్పల నిల్పి యేఁగుచు నున్న
మనుజేశునకుఁ జంద్రమతి సాంగి మొక్కి
ఘన మైనభ క్తితోఁ గరములు మొగిచి
“నలినాప్తకులనాథ నావిన్నవించు
పలుకు వేరొకటి గా భావింప వలదు .........................2210
దలముగా నలుదిశల్ దలకొని మండఁ
జలిచీమ కొరివి వై జను దెంచినట్లు

....................................................................................................... పాటుతో, బెగడి . బెదరి, ధృతిన్ ఆ ధైర్యముతో, నోరాడివాక్రుచ్చి= నోరు కదల్చి చెప్పి, 'నిన్ను ... చిచ్చులో బడు మని నోరాడి వాక్రుచ్చి చెలఁగివీడ్కో లుపవచ్చు నే ' అని యన్వయము. కరుణ... నరునిన్ దయ లేక కఠిన హృదయుఁ డైనమనుష్యునితోఁ జెప్పీకట్లు, నయము ఏది = మెత్తనవిడిచి, 'నన్ను " బలుకు పలికితి' అని అన్వయము, వలము గా చను దెంచినట్లు = నలుప్రక్కల దట్టముగా కార్చిచ్చుక్రము కొని వచ్చుచుండఁగా చలిచీమ తప్పించుకొనుటకై నడుమనున్న యొక కొఱవి పై నెక్కి ప్రాఁకినట్లు నక్షత్రకుఁడు తమ్ము నండగొని యొదిఁగి యున్నాఁడనుట. తము కొఱవిగా రూపించుటచే తామును ఆ కార్చి చ్చులో కొరివివ లెఁగాలనుండుట చూచితము.చలిచీము కొఱని నాశ్రయించుట యెట్లు వ్యర్ధమో అట్లే కాలనున్నత మ్మాశ్రయించుటయు వ్యర్థమనుట, ఉలికి=భ.