పుట:Haindava-Swarajyamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

హైందవ స్వరాజ్యము.

(1) ఎప్పుడో తప్ప ఇంగ్లీషుభాషను ఉపయోగింపడో

(2) వకీలై యున్నచో తనవృత్తిని వదలి చేతిమగ్గమున కూర్చొనునో

(3) వకీలై యున్న , తనజ్ఞానమును కాలమును దేశప్రజకు ఆంగ్లేయులకు సంగతిసందర్భములను బోధించుటకు వ్యయ పరచునో

(4) వకీలైయున్న , కక్షిదారులకలహములతో జోక్యము పెట్టుకొనక కోర్టులను త్యజించి తనయనుభవ ములను చెప్పుట చేత ఇతరుల నదేమార్గమునకు త్రిప్పునో

(5) వకీలైయున్న, వకీలువృత్తి వదలునట్లే జడ్జిపదవిని కూడ త్యజించునో

(6) వైద్యుడైయున్న , వైద్యమును మాని దేహములకు చికిత్సలు చేయుటకన్న ఆత్మలకు చికిత్స చేయుట మే లని పని బూనునో

(7) వైద్యుడైయున్న, యూరోపియను వైద్యముపేరిట చేయబడు జంతుహింసమూలకమున రోగములు కుదుర్చుట కన్న శరీరములు రోగపీడితము లైనను తప్పు కా దని యెరుంగునో

(8) వైద్యుడైయున్నను, చేతిమగ్గమున పనికి దిగి రోగులు తనదగ్గరకు నచ్చినప్పుడు వారి రోగ కారణములను చెప్పి వారిని వృథామూలికలచే వేధించుటకన్న రోగకారణము పో