పుట:Haindava-Swarajyamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపసంహారము.

137

సంపా: వీరికి నే చెప్పున దిది. నిజమైనప్రేమ స్వరూపము నెరింగినవాడు నిర్భీతుడై ఇంగ్లీషువారితో ముఖాముఖిని పైరీతిని వచింపగలడు. ఎవ్వరు భారతనాగరకమే ఉత్తమ మనియు యూరోపియను నాగరకము మూడునాళ్ల ముచ్చట యనియు మనఃపూర్వకముగా నమ్ముదురో వారే యీపనికి వలంతులు, ఇట్టి మూడునాళ్ల ముచ్చట నాగరకము లెన్ని యో కలిగినవి, గతించినవి, కలుగగలవు, గతింపగలవు. ఎవ్వరు ఆత్మబలమును తమంతట తా మెరింగి పశుబలమునెదుట జంకరో పశుబలము నెప్పుడును నుపయోగింపదలంపరో వార లే ఇందుకు సమర్థులు. ఇప్పటి విషమస్థితిని శల్యగతంబుగ ననుభవించి దీనిపై సంపూర్ణాసంతుష్టి ఎవ్వరు పొందినారో వారలే ఇందుకు సాధకులు.

అట్టివాడు ఒక్కడు భారతపుత్రు డున్నను అతడు పైరీతిని ఇంగ్లీషువారితో ప్రసంగించగలడు. వా రాతనిమాటలు విని తీరవలసి యుందురు.

ఈ కోరికలు మనము ప్రకటించుకోరిక లనుకొనరాదు. ఇవి మనమనస్థితిని ప్రకటించునట్టివియె. అడుగుటమాత్రాన మన కేదియు నమరదు. మనము సంపాదించవలసి యుందుము. అందుకు తగినశక్తి కావలెను. అది యెవ్వరికి కలదందురా ?- ఏవాడు