పుట:Haindava-Swarajyamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపసంహారము.

139

ద్రోల ప్రయత్నించునో, మూలికలుతినక రోగి చచ్చినను లోక మంతము కాదు. రోగికిని నష్టములేదు. అని ఎరుంగునో

(9) ద్రవ్యవంతుడై యున్నను, ఆద్రవ్య ముండునా పోవునా యని మీనం మేషము లెక్కలువేసి భీతిచెందక మోమోటముదక్కి తనమానసమున నున్న దానిని పల్కునో,

(10) ద్రవ్యవంతుడైయున్నను, ద్రవ్యమును చేతిమగ్గములు పెట్టుటకు వినియోగించి తాను చేతి నేతవస్త్రములు ధరించుటచే ఇతరుల నామార్గమున ప్రోత్సహించునో

(11) ఇతర భారతపుత్రులవలె, ఈతరుణము, తనకును వ్రతములకు ఉపవాసములకు ప్రాయశ్చిత్తములకు కాల మనుటను నెరుంగునో

(12) ఇతర భారతపుత్రులవలెనే, ఇంగ్లీషువారిని దూరుట వ్యర్థ మనియు మనముకోరగా వారు వచ్చి రనియు మన ముంచుకొనుటవలన వా రున్నా రనియు మనము సంస్కారము కనబరచినప్పుడే వారు పోవుటయో తమ్మును సంస్కరించుకొనుటయో చేయుదు రనియు నెరుంగునో

(13) ఇతరులవలెనే, దుఃఖసమయమున సుఖానుభోగము లననుకరణీయము లనియు పతితులమై యుండు యుగమున కారాగారమున నుండుట ప్రవాసమున నుండుట ప్రశస్తము లనియు నెరుంగునో