పుట:Haindava-Swarajyamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపసంహారము.

131

స్వరాజ్యము కాదు. పర పరిపాలనము. కాబట్టి ఇంగ్లీషువారిని వెడలగొట్టినమాత్రాన మీరు స్వరాజ్యము సంపాదించినట్లెన్న రాదు. స్వరాజ్యముయొక్క నిశ్చయస్వరూప మిదివరలో మీకు వర్ణించితిని. దీనిని పశుబలముచేత ఎప్పుడును సంపాదింప వీలు లేదు. పశుబలము భారతభూమికి స్వభావ సిద్ధసాధనము కాదు. కాబట్టి ఆత్మశక్తిమీదనే మీర లాధారపడనలసి యుందురు. మనయుద్దేశము నెరవేర్చుటకు ఏ సందర్భమునను బలాత్కార మవసర మని మీ రెంచరాదు.

మితవాదుల కేనుబోధించున దిది. "వట్టియర్జీలు పంపు చుండుట మానహీనత. దానివలన మనము లోకువ యని మనమె యంగీకరించినవా రగుదుము. బ్రిటిషుపరిపాలన వీడ రా దనుట ఇంచుమించు దేవుడు లే దనుటయే. దైవ మొక్కడుదప్ప మరి యేమానవుడును ఏవస్తువును వీడరానిది కాదు. అంతేకాక, ఇంగ్లీషువారు భారతభూమిలో నే డుండి యే తీరవలె ననుట వారిని గర్విష్ఠుల జేయుటయె.

ఇంగ్లీషువారు మూటలు ముల్లెలు కట్టుకొని వెళ్లి పోదు రేని భారతభూమి విధవకాబోదు. వారుండగా శాంతము వహింపవలసినవారు వారు పోయినపిదప దేశసంరక్షణకు పోరాడవచ్చును. ఆకస్మికోద్భవమును నడంపరాదు. దానిని పరిణామ మందనిచ్చుటయె కార్యము. కాబట్టి మనము శాంతముగా జీవించుటకుముందు మనలోమనము కలహింపవలసి