పుట:Haindava-Swarajyamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

హైందవ స్వరాజ్యము.

ఇరువదియవ ప్రకరణము.

ఉపసంహారము.

చదువరి: మీయభిప్రాయములను బట్టిచూడగా మీరు మితవాదులు గాదు. జాతీయవాదులుం గాదు. మీది తృతీయ:పంథగా దోచుచున్నది.

సంపా: అది పొరబాటు. నా మానసమున మూడవపక్షము లేదు. అంద రొకేవిధమున నాలోచింతు మనుట వెఱ్ఱీ. మితవాదు లందరు చూచా తప్పక ఏకాభిప్రాయు లని చెప్పరాదు. అంతియ గాదు. సేవమాత్ర మాదర్శముగా కలవారికి కక్ష యేడిది ? మితవాదులు జాతీయవాదులు ఇరువురకుం గూడ నే సేవ యొనర్చువాడ. ఎచ్చట భేదాభిప్రాయము కల్గును అచ్చట దానిని వారికి నివేదించి నామార్గమున నేను సేవ చేయుచు పోదును.

చదువరి: అయిన ఈ రెండుకక్షలవారికి మీ రేమి యుపదేశింతురు.

సంపా: జాతీయవాదులకు నేను చెప్పున దిది. " మీరు భారతభూమికి స్వరాజ్యము కోరుట నే నెరుగుదును. అడిగి నంతమాత్రన మన కది రాదు. ప్రతివాడును దానిని సంపాదించవలసి యుండును. ఇతరులు నాకు సంపాదించిపెట్టునది