పుట:Haindava-Swarajyamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

హైందవ స్వరాజ్యము.

యుందుమేని అది సాగుటయే మేలు. బలహీనుల సంరక్షించుటకు మూడవవా రనవసరము. ఈ సంరక్షణయే మనలను పిరికివారి నొనర్చినది. ఇట్టి సంరక్షణ బలహీనులను నింకను నెక్కువ బలహీనుల గావించునుగాని వేరు కాదు. ఇది మనము గుర్తెరింగినం గాని మనకు స్వరాజ్యము లభింపదు. ఇంగ్లీషు మతాచార్యు డొకరు చెప్పినమాటలు వినుడు. స్వరాజ్యములోని అరాచకత్వము పరరాజ్యములోని సక్రమశాంతి జీవనమునకంటె లెస్స. ఆ మతాచార్యుడు స్వరాజ్యమునకు నే నిచ్చిన హైందవ స్వరాజ్యార్థము నియ్యలేదు. మనకు ఇంగ్లీషుపరిపాలన కానిండు, హైందవపరిపాలన కానిండు నిరంకుశత్వము అక్కర లేదు. ఇది మనము నేరువవలెను. ఇతరులకు నేర్పవలెను.

ఈ యభిప్రాయ మంగీకృత మైనయెడల మితవాదులు జాతీయవాదులు ఏకము కావచ్చును. ఒకరికొకరు భయమందుటకు గాని ఒకరినొకరు అనుమానించుటకు గాని యెడ ముండదు.

చదువరి: అయిన మీ రింగ్లీషువారి కేమి తెల్పుదురు.

సంపా: గౌరవభావముతో వారి కీమాట లందచేయుదును. "మీరు మాపరిపాలకు లనుట నే నంగీకరించెద. మీరు ఖడ్గబలముచే భారతభూమి నేలుచున్నా రా, నాయంగీ