పుట:Haindava-Swarajyamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాత్త్విక నిరోధము

115

ఈవిషయము దీర్ఘతరముగ విమర్శింపరాదు. ఇం దెన్ని యొ పిల్ల ప్రశ్నలు పుట్టక తప్పదు. భార్య నేమిచేయవలెను ? వెంట మోసికొని పోవచ్చునా ? ఆమెకు గలహక్కు లేవి ? ఇత్యాదులు. మహత్కార్యనిమగ్ను లీవిషయములకు సమాధానము నిశ్చయించుకొనవలసి యుందురు.

బ్రహ్మచర్యమున కవసర మున్నయట్టులే దారిద్ర్యదీక్షకును అవసర మున్నది. ద్రవ్యాకాంక్ష సత్యాగ్రహము రెండు నేకస్థలమున నుండజాలవు. ద్రవ్యము కలవారు పారవేయ వలయు నని కాదు ఇందు కర్థము. దానిని గురించి వారు ఉదా సీనులై యుండవలెను. తుది దమ్మిడీవరకు పోయినను సిద్ధపడ వలసినదే కాని సత్యాగ్రహముమాత్రము వీడరాదు.

మనవివరణములో సత్యాగ్రహము సత్యశక్తి యని నాము. అందుచేత సత్య మనుకరణీయము. ఎంతటినష్టము కలిగినను సత్యము వీడరానిది. ప్రాణనష్టము కలుగ నున్నప్పుడు మొదలైనవేళల ననృత మాడరాదా యను మున్నగుప్రశ్న లిచ్చట పొడగట్టును కాని అనృతమును సూనృతము చేయ దలచువారే యీవిమర్శకు దిగుదురు. ఎల్లప్పుడు సూనృతము పాటింప నెంచువారల కిట్టిస్థితులు సంప్రాప్తమే కావు. అయినను, వారికి అసంబద్ధకార్యములు తటస్థించవు.

నిర్భయమానసము లేనిది సత్యాగ్రహ మొక్క యడుగైనను, పెట్టజాలదు. ఆ స్తి యని, గౌరవ మని, బందుగు లని, పరి