పుట:Haindava-Swarajyamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

హైందవ స్వరాజ్యము.

పాలకు లని, అపాయము లని, మృత్యు వని భయ మందువారికి సత్యాగ్రహము నహి.

కష్ట సాధ్య మని సత్యాగ్రహము వీడరాదు. ఎంతటికష్టము వచ్చినను మనము చేసికొనినది కానిచో భరించు మహత్తమ శక్తిని దైవము మనకు ప్రసాదించినాడు. దేశసేవయే పరమావధిగా లేకున్నను ఈ సత్యాగ్రహగుణ మలవడచేసి కొనుట యావశ్యకము. ఆయుధధారులు కా నెంచువారు కూడ సత్యాగ్రహగుణములు సంపాదించియే కావలెను. ఆ లోచనమాత్రన ఆగర్భశూరు డెవ్వడునుకాడు. వీరుడు కా దలచువాడు బ్రహచర్యము ననుష్ఠింపక దప్పదు. దారిద్ర్య వ్రతము నంగీకరింపక తీరదు. నిర్భయవిరహితు డగువీరుడు గగనకుసుమమువంటివాడు. అతడు సత్యవాదియే కావలయు ననునిశ్చయము లేదందురేమో. ఎప్పుడు నిర్భయమానసుడో అప్పుడు మానవుడు రుజుప్రవర్తకు డగును. ఏదోయొకరూపమున భయ మావేశించిననేకాని మానవుడు సత్యమును వదలడు. పై చెప్పిన నాలుగుగుణములసంపాదన మందుచేత నెల్లరకు అవశ్యకర్తవ్యము. ఎవ్వరును తత్పథమునకు నెరవ నవశ్యము లేదు. పశుబలపక్ష పాతికి ఈ గుణములతోడంగూడ ఇంక నెన్ని యో వ్యర్థగుణము లవసర మగును. సత్యాగ్రహి వానిం గోరడు. అంతియగాదు. ఖడ్గధారి అవలంబించు ఇతర గుణము లన్నియు పాక్షిక భీతి యుండుటచేతనే ఆవశ్యకము