పుట:Haindava-Swarajyamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

హైందవ స్వరాజ్యము.

చదువరి: మీమతానుసారము సత్యాగ్రహియగుట సుసాధ్య ముకాదు. అందు కేమార్గ మవలంబనీయమో దయచేసి చెప్పునది.

సంపా: సత్యాగ్రహి యగుట సులభమే. మిక్కిలి కష్టంబును నగు. పదునాలు గేండ్ల పసిబాలుడు సత్యాగ్రహియగుట నే నెఱుంగుదు; అదేరీతిని రోగపీడితులును నైనారు; బలిష్టులును సుఖులును నైనవా ర నేకులు కాలేకపోయిరి. అనుభవముమీద నా కొక్కటి స్పష్ట పడినది. దేశ సేవకై సత్యాగ్రహ మవలంబించువారు బ్రహ్మచర్యవ్రతనిష్ఠులై, దారిద్ర్య వ్రతగరిష్ఠులై, సత్యదీక్ష ప్రవర్తకులై, నిర్భయగుణ భరితులు కావలెను. బ్రహచర్యము, వ్రతనిష్ఠ, లేక మానసమునకు అవసరదార్ఢ్యము కలుగదు. విషయలోలుడు పతితుడై పౌరుషవిహీనుడై ధైర్యదూరు డగును. మహాప్రయత్నమున కనర్హుఁ డగును. అనేకోదాహరణములచే దీనిని దృఢ పరుప వచ్చును. అయిన వివాహితు డేమిచేయవలె ననుప్రశ్న తోచకపోదు. అది తోచవలసిన యవశ్యము లేదు. భార్యా భర్తలు తమమోహముల దీర్చుకొనునప్పుడు అది పశుప్రాయము కాకపోదు. సంతానవృద్ధికి దక్క ఈలౌల్యము నిషేధము. సత్యాగ్రహి ఈ కొద్దిపాటి యనుభోగమునుగూడ జింపవలసి యుండును. అతడు సంతానాభివృద్ధినిగూడ కోరడు. కాబట్టి వివాహితు డైనవాడును బ్రహ్మచారిగ నుండనగు