పుట:Haindava-Swarajyamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాత్త్విక నిరోధము

109

కాలముండునో అంతకాలము మానవులకు దాస్యము తప్పదు. సాత్త్విక నిరోధియే యీసిద్ధాంతమును త్రుంచగలడు.

పశుబలోపయోగము సాత్త్వికనిరోధ సిద్ధాంతమునకు వ్యతిరేకము. ఏలయందురా ! మనము కోరునది, శత్రువు కోరనిది అతనిచేత బలాత్కారముగా చేయించువార మగుదుము. అట్టి బలాత్కారము న్యాయ మైనయెడల అతడు మన యెడల అదేరీతిని ప్రవర్తించుట న్యాయమే యగును. కాబట్టి సమాధాన మెన్నడును కుదురబోదు. గుడ్డిగుర్రము గానుగ చుట్టు తిరుగుచు “ముందుకు బోవుచున్నాను” అనుకొనుపగిది మనమును కుమ్మరిసారెవలె తిరుగుచు అభివృద్ధి నందుచున్నామని పిచ్చి సంతసమును పొందవచ్చును. తమ మనస్సాక్ష్మికి సమ్మతముకాని శాసనములను అనంగీకారార్హము లని యను కొనువారికి సాత్త్వికనిరోధ మొక్కటియే సాధనము. మరి యన్ని యు అరిష్ట కారణములు.

చదువరి: మీరు చెప్పుదానినిబట్టి యాలోచింపగా బలహీనులకు సాత్త్వికనిరోధము పరమాయుధ మనియు బలవంతులు యుద్ధసన్నద్ధులు కావచ్చు ననియు తోచుచున్న ది.

సంపా: ఇది వట్టియజ్ఞానము. సాత్త్వికనిరోధము అనునది యే ఆత్మశక్తి, అజయ్యము. అట్టియెడ దానిని బలహీనులసాధనం బనిమాత్ర మెట్లాడవచ్చును ? పశుబల సిద్ధాంతమును వా