పుట:Haindava-Swarajyamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

హైందవ స్వరాజ్యము.

ఎవ్వడు పౌరుషవంతుడో, ఎవ్వని కాయీశ్వరునిభయము దక్క వేరుభయములేదో వాడు ఇతరులకు జంకడు. మానవ నిర్తితశాసనములు వానిని బంధింపవు. ప్రభుత్వమువారుకూడ ఇట్లు బంధితులు కావలెనని మిమ్మును గోరరు. వారు మీ రిట్లుచేయునది యని యెప్పుడును చెప్పుటలేదు. ఇట్లు చేయ రేని ఈరీతిని దండింతుమందురు. శాసనములో వ్రాసినది వేద మనియు లోబడుటే ధర్మ మనియు అనుకొనునంతటి అధోగతి మనకు సంభవించినది. అన్యాయశాసనమునకు లోనగుట పౌరుష విహీనత్వ మనుటను మానవు డెరుంగునేని అన్యు డెంత నిరంకుశాధికారి యయినను ఇతని కాతడు బానిసీ డెన్నడును కాడు. స్వరాజ్యమునకయి యెరుంగదగిన పరమరహస్యం బిదియే.

అనేకు లేదిచేసిన నది స్వల్ప సంఖ్యాకులను బంధింపవ లె ననుట అంధపరంపరత్వము, ఆధ్యాత్మిక వ్యతిరేకము. అనేకుల అపభ్రంశము కొందర వివేకము – వీనికి సంబంధించిన తార్కాణము లెన్ని యైన చూపవచ్చును. ఎల్లసంస్కారములు అనేకులను సంస్కరించుటను కొందరు ప్రారంభించు నట్టివే గదా! దోపిడిగాండ్రగుంపులో దోపిడికి కావలసిన శిక్షణ మవసర మని యభిప్రాయము. అందులో నొక శిష్టుడు జన్మించినాడు. వా డీసిద్ధాంతము నంగీకరింపవలెనా? అన్యాయశాసనముల నైనను అనుకరింపవలె ననుసిద్ధాంత మెంత