పుట:Haindava-Swarajyamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

హైందవ స్వరాజ్యము.

దించువారలలో ధైర్యము తక్కువ. సాత్త్వికనిరోధియం దది యెక్కువ, అపారము. తన కనిష్ట మగుశాసనమును పిరికివా డెప్పుడైనను తృణీకరింపగలుగునా ? అతివాదులు పశుబల పక్షపాతు లందురు. వా రేల శాసనబద్ధతను మాటిమాటికి ప్రకటించుచుందురు? వారిని నే నిందించుట కాదుకాని వా రింకొకరీతిగా మాటలాడుటకె రాదు. ఇంగ్లీషువారిని వెడల గొట్టి, తాము పరిపాలకు లైనప్పుడు, వారు నన్ను మిమ్మును వారిశాసనములకు దాసులు కావలసిన దని కోరగలరు. వారి రాజ్యాంగాభిప్రాయమున కది తగినదియే. ఫిరంగి యెదుట బెట్టి ప్రాణములుతీసినను సరియే తన కనిష్ట మైనశాసనమును తా నంగీకరించుట లేదని సాత్త్వికనిరోధి నిలువంబడగలడు.

మీ యభిప్రాయ మేమి ? ఎవ్వడు ధైర్యముకలవాడు ? ఫిరంగివెనుక దాగికొని ఇతరులపై గుండుప్రేల్చి చంపునట్టి వాడా? హసన్ముఖముతో ఫిరంగినుండి వెలువడుగోళము నెదుర్కొని ప్రాణము లర్పించువాడా? ఎవ్వడు వీరుడు ? ' కాలుని పరమమిత్రునిగా భావించువాడా? ఇతరులప్రాణముల తనవశము చేసికొనువాడా? పౌరుషము ధైర్యములేనివా డెవ్వడును సాత్త్వికనిరోధి యెప్పటికిని కాజాలడు. దేహబల మెక్కువగా లేనివాడుకూడ సాత్త్వికనిరోధి కావచ్చును. ఇది నా కంగీకారమే. ఒంటరియై ఈ నిరోధము నెరపవచ్చును. కోట్లతోగూడియు నెరపవచ్చును. పురుషులు స్త్రీలు అను