పుట:Haindava-Swarajyamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

హైందవ స్వరాజ్యము.

లోకములో ఇంకను ఇందరుప్రజలు బ్రతికియున్నారుగదా! ఇది యేమిసూచించుచున్నది ? లోకనిర్మాణము కత్తులమీద పశుబలముమీద ఆధారపడి యుండలేదు. ప్రేమ సత్యముల మీద ఆధారపడి యున్నది. అందుచేత ఆత్మశక్తియొక్క ఫలమునకు వేరువాదమే అక్కరలేదు. ఇన్ని యుద్ధములు జరిగినను లోకము నిలిచియుండుటే అత్మశక్తికి ప్రేమశక్తికి ప్రబల తార్కాణము. వేన వేలు కోటానుకోటులు జీవించుట ఈ శక్తి ఆధారముగానే జరుగుచున్నది. లక్షలకొలది కుటుంబములలో అహరహము జనించు చిన్న చిన్న పోట్లాట లన్నియును ఈశక్తిమూలకముగనే నిమేషనిమేషమును తీర్మానమగుచున్నవి. నూర్లకొలదిజాతులు శాంతముగా బ్రతుకుచున్నవి. చరిత్రము ఈవిషయము గమనించలేదు. గమనించ జాలదు. . ఈప్రేమశక్తి ఆత్మశక్తుల ప్రచారమును నాటంకపరచునట్టి సంగతులే చరిత్రనామమున బరగుచున్నవి. ఇరువురుసోదరులకు విభేదము కలిగినది. ఒక్కడు తనతప్పు నెరింగి రెండవనానిదయను ప్రేరేపించు చున్నాడు, ప్రేమను ప్రేరేపించు చున్నాడు. ఇరువురకు శాంతికుదిరి కాలము గడుపుచున్నారు. దీని నెవ్వరును వ్రాసియుంచుట లేదు. కాని వీ రిరువురు, ఏవక్కీలు అడ్డపడుటచేతనో మరి యే కారణమున నో, ముష్టియుద్ధమునకు దిగినప్పుడు తత్తుల్య మగు న్యాయ విచారణకు కడంగినప్పుడు వీరివిషయము రచ్చ కెక్కు