పుట:Haindava-Swarajyamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాత్త్విక నిరోధము

105

చున్నది. పత్రికలలో ప్రకటిత మగుచున్నది. ఇరుగుపొరుగు వారి సంభాషణకు పాత్ర మగుచున్నది. చరిత్రలో భాగము కూడ కావచ్చును. కుటుంబములు తెగలసంగతి యెంతో జూతులసంగతియు నంతే. కుటుంబముల కొకస్వభావము జాతుల కొకస్వభావము కలుగు నని వేరుచేయుటకు కారణము కానరాదు. కాబట్టి చరిత్ర మనునది స్వభావస్థితికి కలిగిన విఘాతములకథగాని వేరుగాదు. ఆత్మశక్తి సహజస్థితి కావున చరిత్రకు నెక్కినది కాదు.

చదువరి: మీరు, చెప్పునదిచూడగా సాత్త్వికనిరోధమునకు సంబంధించిన యుదాహరణములు చరిత్రమున లేవనుట స్పష్ట మగుచున్నది. కాబట్టి ఈ సాత్త్వికనిరోధ మనగా నేమో ఇంక కొంచెము విపులముగా నెరుగుట అవసరము. దయచేసి విశదీకరింపుడు.

సంపా: సాత్త్వికనిరోధ మనగా మనవలె స్వకాయమును కష్టపెట్టుటచే స్వాతంత్ర్యముల సంపాదించుటయే. ఆయుధ ధారణోపాయమున కిది ప్రత్యక్షవిరోధి. నామనస్సాక్షికి సమ్మతము కానిపనిని నేను చేయనిష్టపడక నిలుచుట ఆత్మ బలమును వినియోగించుట. ముష్టిబలపద్ధతుల నుపయోగించి ప్రభుత్వము వారిచే నాకు సమ్మతముకాని శాసనమును రద్దు చేయింతునేని అది దేహబలోపాయ మగును. శాసనమునకు