పుట:Gutta.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావముతో చూచువారిని ఉన్నత స్థితికీ, జ్ఞానస్థితికీ చేర్చునని చెప్పవచ్చును. దీనివలన ఆయన శరీరమునకు పుట్టుకతోనే వచ్చిన భౌతిక గుర్తులకు అభౌతికమైన ప్రభావమున్నదని కూడా చెప్పవచ్చును.


ఆయన పుట్టిన వంశము పేరు కూడా ఒక ప్రత్యేకమైనదే. ఒక విధముగా చెప్పాలంటే ప్రబోధానంద పుట్టుక కొరకే ఆ పేరుగల వంశము భూమిమీద తయారు చేయబడినదని చెప్పవచ్చును. ఆయన శరీరము సర్వసాధారణముగా కనిపించినట్లు, ఆయన వంశము కూడా సాధారణము గానే కనిపించినా దాని లోతుల్లో ఎంతో రహస్యము దాగియున్నది. దానిని వివరించుకొంటే ఇలా కలదు. మనిషి శరీరములో మూడు ఆత్మలు కలవని తెల్పినవాడే త్రైతసిద్ధాంతకర్త. త్రైత సిద్ధాంతమును తెల్పినవాడు ప్రబోధానంద యోగీశ్వరులు, కావున ఆయన పుట్టిన వంశము కూడా త్రైత సిద్ధాంతమును కల్గినదై ఉన్నది. త్రైత సిద్ధాంతములో పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అను మూడు ఆత్మలున్నారని ప్రబోధానంద యోగీశ్వరులే తెలిపాడు. ఇక్కడ మూడు ఆత్మల వరుసక్రమములో జీవాత్మనుండి మొదలు పెట్టి ఆత్మ, పరమాత్మ వరకు చెప్పవచ్చును. లేకపోతే పరమాత్మనుండి ప్రారంభించి ఆత్మ, జీవాత్మ అని కూడా చెప్పవచ్చును. అయితే సర్వసాధారణ మనుషుల విషయములో చెప్పినపుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని చెప్పవలెను. అదే ప్రత్యేకమైన దైవాంశముగల మనిషిలో చెప్పునప్పుడు పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అని చెప్పవలెను. రెండు రకముల మనుషులలో ఆత్మ మధ్యలో ఉండడము గమనించతగిన విషయము. పరమాత్మ లేక దేవుడు అందరికంటే, అన్నిటికంటే గొప్పవాడు కనుక గణిత శాస్త్రములోని సంఖ్యలలో అన్నిటికంటే పెద్ద సంఖ్య తొమ్మిది (9) కావున పరమాత్మ గుర్తుగా 9 ని చెప్పడము జరిగినది. పరమాత్మ మూడు భాగములుగా విభజింపబడి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/31&oldid=279914" నుండి వెలికితీశారు