పుట:Gutta.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాడనుటకు గుర్తుగా 9 ని మూడు సమాన భాగములు చేస్తే ఆత్మ గుర్తుగా ఆరు (6)ను, జీవాత్మ గుర్తుగా మూడు (3)ను చెప్పవచ్చును. అందువలన సృష్ఠికర్త 9,6,3 అని ప్రబోధానంద రచనలో వ్రాయాబడినది. ఈ సూత్రమును అనుసరించి ఒక అజ్ఞాని విషయములో 3 6 9 అనీ, ఒక జ్ఞాని విషయములో 9 6 3 అని చెప్పవలెనని ఉన్నది. ప్రత్యేకమైన, దైవాంశగల కల్గిన ప్రబోధానంద విషయములో 9 6 3 అనియే చెప్పాలి.


అంకెలలో పెద్దసంఖ్య ‘9’ ని పరమాత్మ గుర్తుగా తీసుకొన్నాము. అలాగే అక్షరములలో రహస్యమైన దేవుని గుర్తుగాయున్న ‘గు’ అను అక్షరమును తీసుకొంటున్నాము. ప్రబోధానందది ప్రత్యేకమైన జన్మ కావున గు అను అక్షరముతో ప్రారంభమగు పేరు గల వంశములోనే పుట్టాలి. గు అను అక్షరముతో ప్రారంభమగు ఎన్నో వంశముల పేర్లు కలవు. అయితే వాటిలో పుట్టకుండా ఒక గుత్తా అను పేరుగల వంశములో పుట్టుటకు కొంత కారణముగలదు. అదేమనగా! ప్రతి శరీరములోనూ ఆత్మ జీవాత్మలు జోడుగా ఉండును. అందువలన జోడుగా ఉన్న అక్షరముగల త్తా అను రెండవ అక్షరమున్న గుత్తా వంశములోనే ఆయన పుట్టడము జరిగినది. జీవాత్మకంటే ఆత్మ పెద్దదను విషయమును తెలుపునట్లు దీర్గముగల "తా" ను ఆత్మగా పోల్చి చిన్నదైన జీవాత్మను "త" గా పోల్చి, రెండు అక్షరముల జోడుగా కలిసియున్న త్తా "గు" ప్రక్కనయుంచిన గుత్తా వంశమును ఎన్నుకోవడము జరిగినది. మూడు ఆత్మల గుర్తింపును ప్రతి మనిషి హస్తములోనూ, కన్నులోనూ దేవుడు గుర్తింపుగా ఉంచాడు. హస్తములోనున్న మూడు రేఖలు మూడు ఆత్మలుగా గుర్తింపు పొందియున్నవి. హస్తములోని మూడు రేఖలను తర్వాత పేజీ పటములో చూడుము.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/32&oldid=279915" నుండి వెలికితీశారు