పుట:Gutta.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారికి మాత్రము తెలియునట్లుంచాడు. ఒక ప్రక్క ప్రబోధానంద చెప్పు జ్ఞానము గొప్పదేమీకాదన్నట్లు అందరికీ అగుపించునట్లు చేసి, కొందరికి మాత్రము ఆయన చెప్పు జ్ఞానము నిజమైనదని తెలియుటకు కొన్ని ప్రత్యేకతలు ఏర్పరచాడు. ఆయన జ్ఞానమును చాలామంది గుర్తించనట్లు, ప్రబోధానంద పుట్టిన వికృతి నామ సంవత్సరమునుండి తర్వాత వికృతి నామ సంవత్సరము వచ్చు వరకు అరవై (60) సంవత్సరములలో సృష్ఠ్యాది నుండి లేని నాగరికతను, విజ్ఞానమును (సైన్సు) దేవుడు ప్రపంచములో అభివృద్ధి చేశాడు. విజ్ఞానము పెరుగుట వలన యంత్రములనుండి విపరీత సుఖములను పొందు మనిషి దేవున్ని, దేవుని జ్ఞానమును నమ్మలేని స్థితికి చేరుకొన్నాడు. అన్నిటిని మనిషే చేయుచున్నాడని దేవుని పాత్ర ఏమీలేదను వారు చాలామంది తయారైనారు. 60 లక్షల సంవత్సరముల నుండి లేని అభివృద్ధి 60 సంవత్సరములలో వచ్చినదని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఇది భూమిమీద దేవుని జ్ఞానము గుర్తింపు పొందకుండా పోవుటకు పెద్ద ఆటంకమును ఒకవైపు దేవుడే సృష్టించాడని చెప్పవచ్చును. ఒకవైపు తనమీద ఆసక్తికలవారు మాత్రమే దైవజ్ఞానమును గుర్తించునట్లు ప్రబోధానంద జన్మకు కొన్ని ప్రత్యేకతలను దేవుడు కల్పించాడు. ఆయన సాధారణ మనిషే అన్నట్లు ఆయన జీవితమును అమర్చినా, ఆయన అందరివలె సామాన్యుడుకాడు అన్నట్లు ఆయన శరీరము మీద రెండు గుర్తులుంచబడినవి. ఆ గుర్తులున్న మనిషితో ఎవరు శత్రుత్వము చేసినా వారు అన్ని విధముల భ్రష్టులై పోవుదురు. ఆ గుర్తుల మహత్యము ఎవరికీ తెలియదు. మనిషి శరీరములో అరుదుగానున్న ఆ గుర్తులు ప్రబోధానంద శరీరములో ఉండడము ఒక ప్రత్యేకత. ఆయనకు భౌతిక శరీరము మీదున్న భౌతిక గుర్తులు ఆయనను ద్వేష భావముతో చూచిన వారిని హీనస్థితికీ, అజ్ఞానస్థితికీ చేర్చుననీ, పూజ్య

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/30&oldid=230380" నుండి వెలికితీశారు