పుట:Gutta.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతనికి విలువ నివ్వక హేళనగా ఎందుకు చూచేవారు? సమాజములో ఏ గుర్తింపూ లేని పూర్తి అజ్ఞానులైన తల్లితండ్రులకు ఎందుకు పుట్టాడు? ముఖ్యముగా ఆయన తల్లియే ఆయనను గురించి చెడుగా ఎందుకు చెప్పేది? ఆయన బంధువులు ఎవరితోను ఆయనకు ఎందుకు సంబంధములేదు? ఆయనను ఆయన బందువులు ఎగతాళిగ, చులకన భావముతో ఎందుకు మాట్లాడేవారు? యుక్తవయస్సులో ఆయనకు ఆమ్మాయినిచ్చే దానికి ఆయన కులస్థులు ఎందుకు వెనుకాడేవారు? చివరకు తెలివి తక్కువ అమ్మాయి మరియు మూర్చ రోగమున్న అమ్మాయిని ఎందుకు వివాహమాడవలసి వచ్చినది? అటువంటి భార్యకూడా ఆయనకు ఏమాత్రము విలువనివ్వకుండ మాట్లాడుచు ఆయనను వదలి ఎందుకు వెళ్ళిపోయింది? తన కులముకాని అమ్మాయిని అతను రెండవ భార్యగా చేసుకోవడమేమిటి? ఇప్పటికీ తల్లి ప్రక్క బంధువులుగానీ, తండ్రి వైపు బంధువులుగానీ, భార్యవైపు బంధువులు గానీ ఆయనతో ఎందుకు సంబంధము పెట్టుకోలేదు? ఆయనవద్దకు ఏ బంధువూ ఎందుకు రావడములేదు? ఇలా ప్రశ్నించుకొంటే ఎన్నో ప్రశ్నలు రాగలవు. ఇన్ని ప్రశ్నలను చూచిన తర్వాత ఆయనను ఎవరూ సమర్థించరు, శుద్ద పనికి మాలిన వానిక్రిందికి జమకట్టుదురు. ఇదంతయు ఒకవైపునుండి చూస్తే ఆయన సక్రమమైన మనిషి కాదు అని ఎవరైనా చెప్పగలరు.


మరొకవైపునుండి ఉన్న వాస్తవికతను చూస్తే ఆయనయందు ఏ లోపమూలేదు. ఆయన పుట్టినది ఏ గుర్తింపూలేని అజ్ఞానులకు, అంతేకాక తల్లిదొకదారి, తండ్రిదొకదారిగా బ్రతికేవారు. తల్లితండ్రులు తిండి కొరకే బ్రతికేదన్నట్లు ఏమాత్రము ముందు చూపులేకుండా తిండికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అటువంటి పరిస్థితిలో ఆయనకు యుక్తవయస్సు వచ్చేటప్పటికి ఏమాత్రము ఆస్తిలేనందువలన సమాజములో గౌరవము లేని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/14&oldid=279900" నుండి వెలికితీశారు