పుట:Gutta.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిపాదించాడు. ఆదిశంకరాచార్యులు కేవలము 32 సంవత్సరములు మాత్రము జీవించగలిగి, చిన్నవయస్సులోనే అద్వైతమును ప్రచారము చేయగా తర్వాత 197 సంవత్సరములకు వచ్చిన రామానుజాచార్యులు 120 సంవత్సరములు బ్రతకగలిగి, విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. తర్వాత 100 సంవత్సరములకు వచ్చిన మధ్వాచార్యులు 79 సంవత్సరములు బ్రతకగలిగి తన ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. మధ్వాచార్యుల తర్వాత 633 సంవత్సరములకు (1950) ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు జన్మించి 27 సంవత్సరముల వయస్సునుండి త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించి ప్రచారము చేయగలిగాడు. ఈ విధముగా ఇందూ (హిందూ) మతములో నలుగురు ఆచార్యులు దైవజ్ఞానమును వారి వారి సిద్ధాంతములను ఆధారము చేసుకొని బోధించారు.


ముఖ్యవిషయమేమనగా! శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వా చార్యుల సిద్ధాంతములు తెలియును, కానీ వారి వ్యక్తిగత జీవితములు నాకు తెలియవు. అయితే చివరి సిద్ధాంతకర్త అయిన ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల యొక్క జీవితము పూర్తిగా నాకు తెలియును. ఎందుకనగా ప్రబోధానంద యోగీశ్వరులు అనబడు వ్యక్తి నాకు బాగా తెలుసు కనుక ఇంతవరకు ఏమి జరిగినది అన్నీ తెలియును. నాకు తెలిసి ప్రబోధానంద యోగీశ్వరులు సర్వసాధారణ మనిషి. బయట కనిపించే ఏ ప్రత్యేకతా ఆయనలో లేదు. అయితే ఆయన శరీరములో నివసించే ఆత్మ ఏదో ప్రత్యేకమైనదని చెప్పవచ్చును. ఒక ప్రక్క ఆయనకు తన ఆత్మ గొప్పదని అనిపించినా మరొక ప్రక్క అది నా భ్రమ అనుకొనేవాడిని. ఆయన ఆత్మ గొప్పదైతే ఆయన జీవితము సగటు మనిషికంటే హీనముగా ఎందుకు మొదలయింది? ఆయన ఎందుకు ఆర్థిక ఇబ్బందుల పాలైనాడు? ఎవరూ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/13&oldid=279899" నుండి వెలికితీశారు