పుట:Gurujadalu.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ది.రా : కంసాలి కూడానా?

గిరీ : లేదు.

ది.రా : నీవు ప్రాజ్ఞుడవు. నీకు నేను బుద్ది చెప్పవలసిన వాడను కాను గాని అనుభవాన్ని బట్టి చెబుతున్నాను. బ్రాహ్మణ సంఘ సౌంస్కారంలో కంసాలి వాడు అమాయకంగాను అనపేక్షగాను కలుస్తాడంటే నమ్మవద్దు. యేదో వక ఘట్టి సామిద్రోహం చేసి మన పరువు తీస్తాడు.

గిరీ : నేను ఆ జాగ్రత్త పడగలను. అయినా జాగ్రత్త ఈ వ్యవహారములో అవసరం లేదు. మనము సంఘ సౌంస్కారమని వేశడు మాట ఉపయోగించి లోకాన్ని మూరెడెత్తు పెరిగించామని సంతోషిస్తున్నాము. కంసాలి బాపనోళ్ళకులం చెడుతున్నారు గదా అని ఆనందిస్తున్నాడు. అదివకటి మనకి సేఫ్ సైడ్ (safe side) మరి ఒకటేమిటంటే రామమూర్తి పెత్తండ్రి కొడుకు వెంకన్నని వున్నాడు. వాడియందు కంసాలికి పుత్రప్రేమ. ఆ వెంకన్నని తిన్నగా పెంచక వాడి వంతు భూముల ఫలసాయం పెట్టి కొండుభొట్లు రామమూర్తికి ఇంగ్లీషు చదువు చెప్పించాడని మరికొన్ని కారణాల చేత కొండుభొట్లు మీద కోపం. రామమూర్తికి మేనరికం కుదిర్చివుంచాడు. యీ విధవా వివాహం అయినట్టయినా మేనరికం తప్పిపోతుంది. ఆ పిల్లని వెంకన్నకి పెళ్లి చేయించాలని అక్కాబత్తుడు కుట్ర చేస్తున్నాడు. గనుక భయపడ్డానికి అవుసరం లేదనుకుంటాను. పెళ్లికి తర్లి మూడో రోజు రాత్రి యీ వూరికి పదకొండు మైళ్ళ దూరముననున్న చెరుకువాడ సత్రంలో దిగుతారు. అప్పట్లో మీ గుఱ్ఱబ్బండీ సత్రం పెరటి గొబ్బరితోటలో వుంచి యీ కంసాలి హికమత్ మీద వధూవరులను దాల్లో యెక్కించి రాత్రి వుండగానే తమ యింట్లో పెట్టాలి.

ది.రా : కొంపదీసి మా యింటికే?

గంగా : (ఆత్మగతం) అమ్మగారు పంతులుగారికి వధూవరులకు కూడా గోమయోదకస్నానం, చీపురుగట్ట ప్రయోగం చేత ఉచ్చాటన వెంటనే చేస్తారు.

గిరీ : మీరు పబ్లీకుకు రాకూడదో? మామగారు యింత పిరికి అని నేననుకోలేదు.

ది.రా : పిరికితనమా? యుద్ధానికి వెళ్లమంటే వెళతాను. సమయోచితమయిన జాగ్రత్తను పిరికితనమంటారా? కుర్రవాళ్ల బుద్ధి మిలమిల పరుగెత్తుతుంది. ముసలి బుర్రలు కొంచెం పస్తాయిస్తాయి. కార్య సానుకూలం అయ్యే వరకు పైకి రాకూడదు వకటి. రెండవది నా సహాయ్యం కావలసినదిగాని నా పేరు గొప్ప కావడం నేను విలవగా

గురుజాడలు

510

కొండుభొట్టీయము