పుట:Gurujadalu.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కోదులు, గడబలు, మొదలయిన కొండ జాతుల ఆచారాలంటే తెల్లవాళ్ళు చెవికోసుకుంటారు. పేపర్లలో వ్రాసినా చదవతగి వుంటుంది.

ది.రా : (ఆత్మగతం) కర్ణ పిశాచి వున్న వాళ్ల దగ్గిర కాని కీలు దాగవు.

(ప్రకాశం) ఒక పోయింటు నీవు మరచిపోతున్నావు. హిందూ హిందూ అనే మాట తుడుపు పెట్టి సంఘ సంస్కారమే ముఖ్యముగా ఆలోచించవలసి వుంటుంది. హిందూ అనే మాట చేర్చగానే మన వుద్యమముల లాభము సంకుచితమవుతుంది. రాచకీయ వ్యవహారములలో అన్ని మతముల వారమూ కలుస్తూన్నామా? లేదా? యౌవ్వన వంతులైన వితంతువుల బ్రతుకు సుఖ రహితము కాకుండా వుండడము సంఘ సౌంస్కారము యొక్క ముఖ్యోద్దేశము కదా! యేమత ప్రకారమైతేనేమి వారలు పెండ్లి చేసుకొని సుఖించుట సంఘ సౌంస్కారము కాదా? బ్రహ్మ సమాజమతము కూడా హిందూ మతములలో నొకటని నా అభిప్రాయము. పుత్ర ప్రాయుడవు కావలసినవాడవూ గనక నీ ఆసరా మీద కించిత్తు సంఘ సౌంస్కార రూపకమైన లోకోపకారంలో దిగతలచితిని. నీకు తోడ్పడడముకు యిష్టము లేని యెడల యింతటితో విరమిస్తాను.

గిరీ: (ఆత్మగతం) బాణం గురి దాటింది. మిగిలిపోనియ్య కూడదు.

(ప్రకాశం) నేను చెయ్యబూనుకున్న సహాయం చేసి తీరుతాను. గిరీశం అన్నమాట తప్పినాడన్న మాట యీసర్కి పుట్టలేదు. భగవంతుడనుగ్రహం వల్ల ముందయినా అలా అనుటకు అవకాశము కలుగకూడదు. వధూవరులను యిక్కడకు తెచ్చి దిగబెడతాను. గాని మామగారు పేట్టుతూ వున్న బ్రహ్మ సమాజ హిందూ వివాహ విధానముల కలహంలో నేను చేయి చేసుకో జాలను. సవబు కావలిస్తే నా స్వల్పానుభవమును బట్టి చెప్పుతాను. యెవడి మతం వాడికి సవబు, యెదుటి వాడి మతం వాడికి బేసవబు. నిజమయిన సవబు స్వర్గంలో వుంటే వుండవచ్చును. మనిషికి మనసాసవబుతత్వమాలోచిస్తే మనోవృత్తులు ముందు పరుగెత్తుతాయి. మాటకారి సవబులు కలిపిస్తాడు. నిష్కల్మషమయిన మనస్సు అవ్యాజ్యమయిన భూతదయా వుంటే యేమతమయినా సమ్మతమే.

ది.రా : మామ! నీ మాటలు లేబరింతులా గనబడుతాయి. మాటలను బట్టి మతం పోల్చడం శక్యం కాకుండా వుంది. ఒకమారు శాస్త్రంలో కర్రెత్తుతావు. మరచటి క్షణం శాస్త్రాన్ని తిరుగదోసి సవబుకోసం కత్తి తీస్తావు. ఆ వెంటనే లోకంలో సవబు లేదంటావు.

గిరీ : నా మతం నాకే పోల్చడానికి దుస్థరంగా వుందనుకుంటాను. మతం వుపాది వేసి కడతారనుకున్నారు కాబోలు మామగారు - యేండవేళ వొక మతం - చల్లని వేళ

గురుజాడలు

508

కొండుభొట్టీయము