పుట:Gurujadalu.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



గంగా : అడగకపోతే యెటులను.

గిరీ : ఇదివరకే వ్యవహారం జరిగిపోతూ వుంది. నలుగురూ ఐకమత్యంగా రిఫారం పని చేసుకుపోతూ వున్నారు. ఇప్పుడు నాయుడుని లేవదీశారు. మాధవయ్య గారికి తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు. ఇప్పుడు మీరు చేస్ని దోహదం వల్ల వారుభయులు జుత్తూ జుత్తూ పట్టుకుంటారు. ఈ దేశంలో రిఫారం (Reform) అమాంతంగా రెండు ముక్కలవుతుంది. అదే నా అభిప్రాయం. మామగారు శలవియ్యండి.

ది.రా : (ఆత్మగతం) వీడు అసాధ్యప్పిండం. యితడి సహాయం లేనిది పని కాదు. మామ అని పిలవడం ఆరంభించాడు. యుగంధరరావు నేనూ స్కూలులో చదువుకునే రోజులలో అన్నా తమ్ముడు అని పిలుచుకునే వారము. యెదిగిన పిల్లలు గల తండ్రులను మామ అని పిలిస్తే మనస్సుకు కించిత్తు అనుమానం తగులుతుంది. యింట్లో చనువుగా తిరుగుతాడు వద్దంటే బాగుండదు. యెంతటి వాడికైనా వీడిని చూస్తే సరదా. ప్రవర్తన చెడ్డదని వినలేదు. గాని వీడి నాటకాలు, గారడీ చూడకుండా పిల్లల్ని ఖాయిదా పెట్టాలి. వెధవ పిల్లని మాత్రం యీ వూళ్ళో వుంచితే మాటదక్కదు. అన్న దగ్గరకు పంపించివేతాము.

గిరీ : మామగారు! యేమిటి ఆలోచిస్తున్నారు.

ది.రా : మరేమీ లేదు. మీ నాయినే యీ వ్యవహారంలో ప్రవేశిస్తే నీవు హాస్యాలు అడ్లు మాని సహాయం చేతువు గదా!

గిరీ : మా తండ్రి యే వ్యవహారములో దిగినా ముందూ వెనుకా చూడకుండా దిగేవారు. తండ్రిగారు దిగినా నాకు తోచిన మాటలు చెప్పవలసివస్తే చెప్పే వాడినే.

ది.రా : అయితే నీవంటి బుద్దిమంతులు సంఘ సంస్కారముకు మొనగాళ్ళయి వుండిన్నీ బేసవబయిన మార్గాన్నపని జరుగుతూ మనమంతా అన్య మతస్తులకు హాస్యాస్పదం కావడం నీకు మనస్కరించి యున్నదా? పెళ్లాడే కుర్రవాడు బ్రహ్మ సమాజ మతస్తుడైనప్పుడు హిందూ శాస్రోక్తంగా పెళ్లి చెయ్యడం నీకు యుక్తమనే తోచిందా?

గిరీ : పెళ్లికూతురిది యే మతమో ఆలోచించారా? (ఆత్మగతం) యిదివరకు రంకుమతం.

ది.రా : మనలో స్త్రీలు అజ్ఞానులు. అస్వతంత్రులున్ను. వాళ్ళకి “గతానుగతికో లోకః” అన్నట్లు | ఆచరణే గాని మతమంటూ వకటున్నదీ? క్రమంగా ఆ పిల్ల భర్త మతం అవలంబిస్తుంది. యిన్ యేంటిసిపేషన్ (in anticipation) మనం అందులో చేర్చవచ్చును.

గిరీ : కిరస్తానులు, తురకలూ, విధవా వివాహం చేసుకుంటే హిందూ సంఘ సౌంస్కారానికి యెంత లాభమో బ్రహ్మ సమాజం వారు చేస్తే అంతే లాభము. అంతకంటె సవరలు,

గురుజాడలు

507

కొండుభొట్టీయము