పుట:Gurujadalu.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పాప : బ్రహ్మదేవుడు నీకలా రాశాడు. నాకిలా రాశాడు. కావలిస్తే బ్రహ్మదేవుడితో వెళ్ళి ఫిర్‌యాద్ చేసుకో. శాస్తుల్లు గారు యీ వూళ్లో డాన్‌సు కథ యేమయినా వున్నదా యేమిటి - లేకుంటే పంతులు పడడు.

కొండు : యీ దేవాలయం నౌఖర్లులో మంజువాణి సాక్షాత్తు రంభావతారం, వుంది.

పాప : యెవరైనా వుంచుకున్నారా?

కొండు : నరహరిరావని ఒక పంతులు వుంచుకున్నాడు.

పాప : అయితే మా పంతులికి అవకాశం యెలాగ?

కొండు : నేను కొంచెము వైద్యము కూడా చేస్తాను. పంతులుకి పైత్యాధికం పోవడానికి అప్పటప్పట విరోచన సాధనం చేస్తాను. దాంతో మూడు నాలుగు రోజులు మంజువాణికి ఆట విడుపు కలుగుతూ వుంటుంది.

బుచ్చన్న : నువ్వు పాతర సామాను పట్టుకుంటే నేదీనస్సు పట్టుకుంటాను.

కొండు : నా ప్రారబ్ధం కాలితే నా స్వగ్రామంలో మూటలు మొయ్యమంటావు.

బుచ్చ : అంత పౌరుషముంటే - వెదికి కూలాణ్ణి యెవడ్నయినా తీసుకురా.

(కొండుభట్లు నిష్క్రమించును.)

(తెర దించవలెను)


కొండుభొట్టీయము

ద్వితీయాంకము

సప్తమ రంగము

(మంజువాణి పెరటి యింట్లోగది. ఆ గదిలో ఒక వైపు పెద్ద పాత పందిరి మంచము, ఒక మూలకు ఒక పాతబోను పెట్టె గోడవైపు రెండు పెద్ద జాడీలు, గోడలకు బల్లల పీటలు, వాటి పైని బొమ్మలు పాతపఠాలు, పందిరి మంచము క్రింద యిత్తడి సామానులు.)

(చింపిరితల, కొంచము మాసినబట్టతో కనకవల్లి, దువ్వినజుత్తు, తగు మాత్రం అలంకారం, కావిరంగు చీరతో మంజువాణి, ఒక జాడీకి యీ ప్రక్కనొకరు, ఆ ప్రక్కనొకరు నిలిచివుందురు. రత్నాంగిచేతిలో, ఒక వెలుగుతూ వున్న కొవ్వొత్తి, జాడీ దగ్గర ఒక మొక్కల పీటపైని, బంగారపు సరుకులు, మరి ఒక పీట మీద వెండి సామాను, ఒకవేపు బట్టల మూట.)

గురుజాడలు

488

కొండుభొట్టీయము